https://oktelugu.com/

Himba Tribe : అక్కడ పెళ్లిల్లో మాత్రమే స్నానం చేస్తారు. జీవితంలో ఎప్పుడు చేయరు. మరి వారి శరీరం ఎలా శుభ్రంగా ఉంటుంది. హింబా తెగ గురించి దారుణమైన ఫ్యాక్ట్స్

స్నానం చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇది ఒక ప్రాంతంలో నిషిద్ధం అంటే నమ్ముతారా? అవును ఇలాంటి ఓ ప్రపంచం కూడా ఉందంటే ఊహించుకోండి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 12, 2025 / 03:00 AM IST

    Himba Tribe

    Follow us on

    Himba Tribe : స్నానం చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇది ఒక ప్రాంతంలో నిషిద్ధం అంటే నమ్ముతారా? అవును ఇలాంటి ఓ ప్రపంచం కూడా ఉందంటే ఊహించుకోండి. అవును మీరు విన్నది నిజంమే. ప్రపంచంలో స్నానాన్ని పూర్తిగా తిరస్కరించే ఓ తెగ ఉంది. వివిధ సంస్కృతులు వేర్వేరు స్నాన ఆచారాలను కలిగి ఉంటారు. అయితే ఎవరైనా జీవితాంతం స్నానం చేయకుండా ఉంటారంటే మాత్రం వినడానికి కాస్త కష్టంగా ఉంటుంది కదా.

    ఈ తెగ ప్రజలు స్నానానికి బదులు పొగతో స్నానం చేస్తారు. వారు మూలికలను కాల్చి, పొగతో తమ శరీరాలను శుభ్రం చేసుకుంటారట. ఇది కాకుండా, వారు తమ శరీరానికి ప్రత్యేకమైన లోషన్‌ను పూసుకుంటారు, ఇది వారిని మురికి నుంచి కాపాడుతుంది. వారి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ ఔషదం సాధారణంగా జంతువుల కొవ్వు, ఖనిజాల నుంచి తయారు చేస్తారు. దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా?

    స్త్రీలు పెళ్లి రోజున మాత్రమే స్నానం చేస్తారు
    ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాల్లో నివసించే హింబా తెగ వారి జీవన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నమీబియాలోని ఈ మూలలో నివసిస్తున్న ఈ తెగకు నీటిని పొదుపు చేస్తారు. వారి నమ్మకాల ప్రకారం, శరీరంపై పూసిన మట్టి పొర సూర్యుని బలమైన కిరణాల నుంచి వారిని కాపాడుతుంది అనుకుంటారు. వారిని క్రిముల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. అందువల్ల, వారు క్రమం తప్పకుండా స్నానం చేస్తారు. స్త్రీలు తమ పెళ్లి రోజున మాత్రమే నీటితో స్నానం చేయిస్తారట. ఈ తెగ ప్రజలు తమ బట్టలు ఉతికిన మట్టి మిశ్రమంతో శుభ్రం చేసుకుంటారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, హింబా తెగ ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది.

    స్నానం చేయకుండా శరీరం ఎలా శుభ్రంగా ఉంటుందంటే?
    హింబా తెగ ప్రజలు స్నానానికి బదులు ప్రత్యేకమైన రీతిలో పరిశుభ్రతను పాటిస్తుంటారు. రకరకాల మూలికలను నీటిలో ఉడకబెట్టడం వల్ల వచ్చే పొగతో వారు స్నానం చేస్తారు. ఈ పొగలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు క్రిములను చంపి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పద్ధతితో పాటు, మహిళలు కూడా ఒక ప్రత్యేక రకం ఔషదం ఉపయోగిస్తారు. ఈ ఔషదం జంతువుల కొవ్వు, హెమటైట్ అనే ఖనిజంతో తయారు చేస్తారు. ఈ ఔషదం చర్మానికి తేమను అందించడమే కాకుండా సూర్యకాంతి నుంచి రక్షిస్తుంది. కీటకాలను దూరంగా ఉంచుతుంది.

    తల్లి కావడానికి ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది.
    తెగలో, మహిళలు తల్లులు కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక ప్రత్యేక కర్మను నిర్వహించాలి. ఈ ఆచారంలో వారు పిల్లలకు సంబంధించిన పాటలను వినమని సలహా ఇస్తుంటారు. చెట్టుకింద కూర్చుని ఈ పాటలు వింటారట. ఇది మాత్రమే కాదు, ఈ మహిళలకు కొత్త పాటను కంపోజ్ చేసే పనికి కూడా పూనుకుంటారట. ఈ పాట కూడా పిల్లలకు సంబంధించినది. ఈ పాటను రూపొందించిన తర్వాత, స్త్రీ దానిని తన భాగస్వామికి పాడి వినిపిస్తుంది. ఇద్దరూ కలిసి ఈ పాటను పాడటం ద్వారా ఒక ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. స్త్రీ గర్భవతి అయినప్పుడు, ఆమె ఈ పాటను ఇతర తెగ మహిళలకు నేర్పుతుంది. ప్రసవ సమయంలో కూడా స్త్రీకి ఈ పాట పాడతారు. అంతే కాదు బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అప్పుడప్పుడూ ఈ పాట పాడుతూనే ఉంటారు.