https://oktelugu.com/

Dry Fruits : తక్కువ ధర అని ఆ డ్రై ఫ్రూట్స్ ను ఏరికోరి మరీ కొంటున్నారా? ఒకసారి ఇది చదవండి.

ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తినే డ్రై ఫ్రూట్స్ మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి అంటే నమ్ముతారా. అవును ఇది నిజం. 100% నిజం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 12, 2025 / 04:00 AM IST

    Dry Fruits

    Follow us on

    Dry Fruits : ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తినే డ్రై ఫ్రూట్స్ మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి అంటే నమ్ముతారా. అవును ఇది నిజం. 100% నిజం. చలికాలం ప్రారంభం నుంచి అంటే డిసెంబర్ నుంచి ప్రస్తుత జనవరి వరకు కాశ్మీర్ నుంచి వచ్చే డ్రై ఫ్రూట్స్ పై విషం పూస్తున్నారనే వార్తలు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయి. మరి దీని గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి నిధి. రోజూ ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తింటే రోగాలు శాశ్వతంగా దూరమవుతాయని సామెత ఉంది కదా. మీరు మీ పెద్దల నుంచి కూడా ఇది విని ఉంటారు కదా.

    జీడిపప్పు, వాల్‌నట్‌లు, బాదం, పిస్తా లేదా ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు ఖర్జూరా వంటి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతి గింజకు దాని స్వంత ప్రయోజనాలు ఉంటాయి అంటారు నిపుణులు. కొందరు అల్పాహారంగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మరికొందరు డ్రై ఫ్రూట్స్‌తో లడ్డూలు చేసుకొని మరీ తింటారు. ఖీర్‌లో డ్రై ఫ్రూట్స్‌ వేసి రుచి చూస్తే మరింత సూపర్ గా ఉంటుంది కదా. అందుకే కొందరు పాలలో కలుపుకుని మరీ తాగుతుంటారు. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తినే డ్రై ఫ్రూట్స్ మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి అంటున్నారు నిపుణులు. ఇది అబద్ధం అనుకుంటున్నారా? కానీ ఇది 100% నిజం. ఎందుకంటే?

    నాణ్యమైన డ్రై ఫ్రూట్స్‌ను కాశ్మీర్‌కు చెందినవిగా భావిస్తారు. కానీ ఇప్పుడు కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్‌గా నటిస్తూ పాత, నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్‌ను మార్కెట్లో చలామణీ అవుతున్నాయి. జైపూర్‌లో అలాంటిదే జరుగుతోంది. ఎక్కడికక్కడ కొందరు కల్తీ వ్యాపారులు లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    దేశంలోని అనేక నగరాల్లో, ప్రత్యేకించి జైపూర్‌తో సహా పలు అత్యాధునిక నగరాల్లో, కల్తీ వ్యాపారులు పాత డ్రై ఫ్రూట్స్‌కు రంగులు వేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పాత డ్రై ఫ్రూట్స్‌ను రసాయనాలతో శుభ్రం చేసి మళ్లీ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు.

    గతేడాది డిసెంబర్ 31 వరకు జైపూర్‌లో 545 నమూనాలు తీసుకోగా, అందులో 90 నమూనాలు సబ్‌స్టాండర్డ్‌గా గుర్తించారు. మధ్యప్రదేశ్, యుపీ నుంచి కూడా ఇటువంటి రసాయనాలు కలిపిన డ్రై ఫ్రూట్స్ గురించి నివేదికలు రావడంతో ఆందోళన చెందుతున్నారు ప్రజలు.

    అయితే లోపల నుంచి కుళ్ళిన డ్రై ఫ్రూట్స్ గురించి ఆలోచించండి. దానికి రంగులు వేసి అంటే కెమికల్ కోటింగ్ వేసి మంచివి అని అమ్ముతున్నారు. దేశంలోని అనేక జిల్లాల్లో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు అమ్మకం దారులు. చౌక ధరల పేరుతో కాలం చెల్లిన డ్రై ఫ్రూట్స్‌ను కొనుగోలు చేయకూడదని ఆహార శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

    ఇలాంటి డ్రై ఫ్రూట్స్ విషం కంటే డేంజర్. దీని వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, మంట వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి డ్రై ఫ్రూట్స్ కూడా తింటుంటే, జాగ్రత్తగా ఉండండి. డ్రై ఫ్రూట్స్‌ని మంచి షాపులో మాత్రమే కొనాలని మా సలహా. చౌకగా లభిస్తే అసలు కొనుగోలు చేయకండి. చౌకైనవి అని ఆశపడవద్దు. లేదంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.