Bank Rules Change: ఆర్థిక వ్యవహారాలు జరిపే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ తోనే డబ్బు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇంట్లో డబ్బును ఉంచుకునేవారు. కానీ ఇప్పుడు ఇంట్లో ఏమాత్రం నిల్వ చేయకుండా బ్యాంకులోనే డిపాజిట్ చేస్తున్నారు. అయితే బ్యాంక్ అకౌంట్ తీసుకునే సమయంలో నామిని గురించి అడుగుతారు. అంటే భవిష్యత్తులో ఖాతాదారుడికి రిస్కు ఏర్పడితే అందులో ఉన్న డబ్బులు నామినీకి వెళ్తాయన్నమాట. ఇప్పటివరకు ఈ నామినిగా చేర్చుకోవడానికి ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చేవారు. కానీ ఇకనుంచి నలుగురికి అవకాశం ఇస్తున్నారు. ఆ వివరాలు లోకి వెళ్తే..
ఒక వ్యక్తి ఆర్థిక వ్యవహారాలు జరపడానికి బ్యాంక్ అకౌంట్ కీలకంగా ఉంటుంది. తనకు సంబంధించిన డబ్బు మొత్తం బ్యాంకు తోనే వ్యవహారాలు జరుగుతూ ఉంటారు. ఏవైనా చెల్లింపులు లేదా.. మనీ తీసుకోవడం వంటివి బ్యాంకు ద్వారానే చేస్తారు. ఇలా తనకు సంబంధించిన మొత్తం ఆర్థిక వ్యవహారాలు బ్యాంకుతో లింక్ అయి ఉండడం వల్ల దీనిని ప్రధానంగా చూస్తారు. అయితే ఖాతాదారుడికి భవిష్యత్తులో అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగి మరణిస్తే.. ఈ బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలు లేదా బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం నామినీకి వెళ్తుంది. బ్యాంక్ అకౌంట్ తీసుకునే సమయంలోనే నామినీ పేరును చేరుస్తారు. ఈ నామిని పేరు చేర్చుకోవడానికి ఇప్పటివరకు ఒకరికి మాత్రమే అవకాశం ఇచ్చేవారు. కానీ ఇకనుంచి నలుగురి నామిని పేర్లను చేసుకోవచ్చు. ఖాతాదారుడికి రిస్క్ జరిగే మరణిస్తే ఇందులో ఉన్న డబ్బు మొత్తం ఆ నలుగురికి చెందుతుంది.
అయితే నలుగురు నామినీలు ఉంటే వారికి వాటాలుగా పంచుతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఖాతాకు నలుగురు నామినేలు ఉంటే అందులో మొదటగా భార్యకు 50%.. తల్లికి 20 శాతం, తండ్రికి 20 శాతం మరొక వ్యక్తికి 10% హక్కు ఉంటుంది. అంటే ఇందులో ఉన్న డబ్బు లేదా బ్యాంకుకు సంబంధించిన ఏ ఆర్థిక వనరులు అయినా ఇలా వాటాలుగా విభజించి చెల్లిస్తారు. ఇప్పటివరకు బ్యాంకు అకౌంట్ కు నామినీగా ఒక్కరే ఉంటే.. మరో ముగ్గురిని చేర్చుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకుకు సంబంధించిన యాప్ లేదా బ్యాంకు కార్యాలయానికి వెళ్లి ఇలా మిగతా వారి నామినీలను చేర్చుకోవచ్చు. ఈ విధానం నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. నవంబర్ ఒకటి తర్వాత మాత్రమే ఖాతాదారులు తమ నామినీలను చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నామినీలు చేర్చుకునే సమయంలో అందరి ఆమోదం ఉండే విధంగా చేయాలి. అందరి సఖ్యతతోనే ఇందులో చేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువ మంది నామినేలు ఉండడం వల్ల ఖాతాదారుడి ఆర్థిక వ్యవహారాలను సులభంగా విభజించవచ్చని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.