Bank Loan : ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. ఈ రెండు కార్యక్రమాలు ఒక వ్యక్తి తన జీవితంలో చేసినట్లయితే అతను సమర్ధవంతుడై అని పేర్కొనేవారు. అయితే నేటి కాలంలో డబ్బు ఉంటే అన్ని పనులు సక్రమంగా నిర్వహించుకోవచ్చు అని అనుకుంటారు. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడం అంటే సాహసం చేయడమే అని అనుకోవచ్చు. ఎందుకంటే నేటి కాలంలో ఎంత చిన్న ఇల్లు నిర్మించుకోవాలనుకున్న లక్షల రూపాయల్లో ఖర్చు అవుతుంది. అయితే ఆదాయం లేని వారు బ్యాంకు లోన్ ద్వారా తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఇలా బ్యాంకు లోను తీసుకునే ముందు కొన్ని విషయాలను ఆలోచించాలి. వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇల్లు నిర్మాణం మొదలు పెట్టాలి. అవేంటంటే?
కొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రకారం.. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కచ్చితంగా అవసరమే. కానీ సరైన ఆదాయం ఉన్నప్పుడే ఇల్లు నిర్మాణం మొదలు పెట్టుకోవాలని అంటున్నారు. ప్రస్తుత కాలంలో బ్యాంకు రుణాల ద్వారా చాలామంది ఇల్లు నిర్మించుకుంటున్నారు. కొంతమంది 100% అప్పులు చేసి ఇల్లు పనులు మొదలు పెడుతున్నారు. మరికొందరు చేతిలో డబ్బు లేకుండా ఇల్లు ప్రారంభించి ఆ తర్వాత రుణం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల ఆర్థికంగా కోరుకుపోవడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు అని అంటున్నారు.
బ్యాంకు రుణం ద్వారా ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారు.. ముందుగా ఆ బ్యాంకు ఎంత వడ్డీ విధిస్తుందో తెలుసుకోవాలి. ఎందుకంటే తాత్కాలికంగా కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ అని తెలిపిన.. ఆ తర్వాత అధిక వడ్డీని మోపుతారు. అంతేకాకుండా కొందరు ఏవేవో ప్రాసెసింగ్ ఫీజులు చెప్పి అదనపు ఖర్చులను వేస్తుంటారు. ఈ మొత్తానికి కూడా వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల బ్యాంకు లోను తీసుకునే ముందు కచ్చితంగా వడ్డీ ఎంతో ధ్రువీకరించుకోవాలి.
చాలామంది చేస్తున్న ప్రధాన తప్పు ఏంటంటే మొత్తం బ్యాంకు రుణం ద్వారా ఇల్లు నిర్మించుకోవడం. కానీ చేతిలో కనీసం 50 శాతం మనీ ఉంటేనే ఇల్లు పనులు మొదలుపెట్టాలి. ఆ తర్వాత మిగతా అప్పు చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇల్లుతోపాటు కుటుంబ జీవితం కూడా చాలా అవసరమే. అందువల్ల ముందు ఇంటి అవసరాలు కు కొంత నగదు కేటాయించిన తర్వాతే మిగతా అప్పు చెల్లించేలా ఉండాలి. అలాంటప్పుడు నగదు కూడా పెట్టుకున్న తర్వాతే ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి.
బ్యాంకు లోను తీసుకుని సమయంలో దాదాపు ఇంటికి సంబంధించిన పత్రాలు తనగా పెట్టాల్సి ఉంటుంది. అయితే అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు బ్యాంకు రుణం చెల్లించే పరిస్థితి రానప్పుడు.. ఇల్లును వేలం వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఎక్కువగా బ్యాంకు రుణం పైనే ఆధారపడకుండా చేతిలో ఉన్న నగదుతో ఇల్లు పనులు మొదలు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఇల్లు పనులు ప్రారంభిస్తే ఏడాది లోపల పూర్తయ్యే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. లేకుంటే ఆదాయం ఇతర అవసరాలకు వెళ్లిపోయి ఇల్లు నిర్మాణం అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది.
Also Read : తీసుకునేవారికి అలర్ట్.. ఈ విషయంలో మోసం చేస్తారు..