Rohit Sharma: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా ఉంది రోహిత్ శర్మ పరిస్థితి. బీసీసీఐ టీమిండియా కెప్టెన్ గా అవకాశం కల్పించినా ఫిట్ నెస్ కారణంగా ఆటకు దూరం కావడం దురదృష్టమే. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా రోహిత్ శర్మకు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేని వైనం. దీంతో అతడు నిరాశగానే ఉన్నాడు. తానేమిటో నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న విధి మాత్రం రోహిత్ ను వెంటాడుతోంది. పర్యవసానంగా అతడి ప్రతిభ వెలుగులోకి రాకుండా పోతోందని తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ తరువాత కోహ్లిని తప్పించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా మళ్లీ అతడినే ఎన్నుకుని కోహ్లిని దూరం చేసి టెస్ట్ జట్టుకు మాత్రమే కెప్టెన్ గా నియమించారు. రోహిత్ శర్మకు ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని భావించినా అతడికి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ మాత్రం అవకాశం ఇవ్వగా దాన్ని క్లీన్ స్వీప్ చేసి తన సత్తా నిరూపించుకున్నా ప్రస్తుతం అతడికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.
Also Read: హైదరాబాద్ ఫ్లై ఓవర్‌ను వాడుకోవద్దు.. బీజేపీ నేతల గూబ గుయ్యిమనిపించిన కేటీఆర్
ఎవరూ ఊహించని విధంగా హిట్ మ్యాన్ రోహిత్ తొడ కండరాలు పట్టేయడంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో గాయం కారణంగా టెస్ట్ సిరీస్ కు అందుబాటులో లేకపోవడంతో బెంగుళూరులోని ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్నారు. ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. అయితే రోహిత్ శర్మ కోలుకోవడానికి ఇంకా సమయ పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
గాయానికి చికిత్స తీసుకుంటూనే భారత అండర్ -19 ఆటగాళ్లకు పాఠాలు చెబుతున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా గతంలో కూడా పలు మ్యాచ్ లకు దూరమైన రోహిత్ ఇప్పుడు అందుబాటులో లేకపోవడం నిజంగా దురదృష్టమే. రోహిత్ శర్మ త్వరగా కోలుకుని జట్టులోకి వచ్చి తన పెర్ఫార్మెన్స్ చూపించాలని అభిమానులు కోరుతున్నారు.
Also Read: మొన్న ‘చీప్ లిక్కర్’.. నేడు ‘ఐటెం సాంగ్’.. ఏపీ బీజేపీకి ఏమైంది?