Life lessons from Baahubali characters: తెలుగు దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి రచించి.. తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతూ ఉంటాయి. సోసియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని చాలామంది ప్రేక్షకులు అంటూ ఉంటారు. సాధారణ సినిమాలో హీరో హీరోయిన్ మాత్రమే హైలెట్గా నిలుస్తారు. కానీ బాహుబలి సినిమాల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్లు ఒకదానితో మరొకటి లింక్ అయి ఉంటాయి. అయితే సినిమాలో ఊహించి ఈ క్యారెక్టర్ లను సృష్టించినా.. రియల్ లైఫ్ లో ఈ పాత్రలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఏడు పాత్రల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఈ ఏడు పాత్రలు మనం జీవితంలో చూసేవే. వీటిని దృష్టిలో ఉంచుకొని మనం జీవితాన్ని చక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఏడు పాత్రల గురించి తెలుసుకుందామా..
బాహుబలి:
ప్రభాస్ పోషించిన ఈ పాత్ర సినిమాకు మెయిన్ గా నిలుస్తుంది. ఎటువంటి ఆపదనైనా గట్టెక్కించే శక్తి ఉన్న ఈ క్యారెక్టర్ మంచితనం, మానవత్వం తో కూడుకొని ఉంటుంది. అలాగే భయంకరమైన యుద్ధాన్ని కూడా ప్లానింగ్ తో గెలిచే ఈ పాత్ర సినిమాకు నెంబర్వన్ గా ఉంటుంది. అయితే బాహుబలిలో ఉన్న మంచితనం అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. చుట్టుపక్కల ఉండేవారే తన జీవితానికి విలన్ల ఉంటారు. అంటే ప్రతిరోజు మన చుట్టుపక్కల ఉండే వారితో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని ఈ పాత్ర తెలుపుతుంది.
కట్టప్ప:
ఎదుటివారు ఎంతటి బలవంతుడైన వారిని చేదించగలిగే ధైర్యం.. రాజులకు నమ్మకంగా ఉండే మనస్తత్వం.. ఇచ్చిన మాట కోసం చేసే పని ఈ పాత్ర తెలుపుతుంది. అంటే నిజజీవితంలో కూడా కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని ఈ పాత్రను చూస్తే తెలుస్తుంది. అలాగే ఎలాంటి సమస్య వచ్చినా భయపడిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి అని కట్టప్ప పాత్రను చూస్తే తెలుస్తుంది.
శివగామి:
కన్న కొడుకుని కాకుండా శక్తి సామర్ధ్యాలు, మంచితనం, మానవత్వం ఉన్న బాహుబలిని రాజుగా చేయాలని మనస్తత్వం శివగామిలో ఉంటుంది. అంతేకాకుండా తన సొంత కొడుకు కాకుండా తల్లి ప్రేమను చూపిస్తూ అలరిస్తుంది. రియల్ లైఫ్ లో కూడా సొంతవారు .. పరాయివారు అని కాకుండా మంచి వ్యక్తులను ఆదరించాలని ఈ పాత్ర తెలుపుతుంది.
బల్లాల దేవ:
ఒక మనిషిలో ఉండే క్రూరత్వం, అహంకారం ఎంతటి బలవంతుడునైనా నాశనం చేస్తుందని బల్లాల దేవా పాత్ర తెలుపుతుంది. అంతేకాకుండా ఈ లక్షణాలు ఉన్నవారు తమ జీవితాన్ని మాత్రమే కాకుండా తమ వంశాన్ని కూడా నాశనం చేస్తారని ఈ క్యారెక్టర్ తెలుపుతుంది. నిజజీవితంలో కూడా ఈ రెండు లక్షణాలను కలిగి ఉన్నవారు తమ జీవితాలను నాశనం చేసుకుంటారని తెలుస్తుంది.
బిజ్జల దేవ:
అవిటి తనం అనేది అవయవాల్లో కాదు.. మనసులో ఉందని ఈ పాత్ర తెలుపుతుంది. తన శరీరం ఎలా ఉన్నా.. ఎదుటి వ్యక్తి నాశనం కావాలనే మనస్తత్వం ఉంటే ఎప్పటికైనా జీవితం సర్వనాశనమే అవుతుందని ఈ పాత్ర తెలుపుతుంది. నిజా జీవితంలో కూడా ఎదుటివారి నాశనం కోరుకునే లక్షణం ఉండదని దీనిని చూస్తే నేర్చుకోవచ్చు.
కుమార వర్మ:
తనలో శక్తి ఉందని.. అయితే అది సందర్భం బట్టి బయటకు వస్తుందని ఈ పాత్ర తెలుపుతుంది. అలా వచ్చినప్పుడు కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. నిజజీవితంలో కూడా సందర్భాన్ని బట్టి బలనిరూపణ చేసే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి.
కాలకేయ:
జీవితంలో నేను గొప్ప అనుకోవడంలో తప్పులేదు. కానీ నేనే గొప్ప అని అనుకుంటే మాత్రం ఎదుటివారి చేతిలో పతనం కాక తప్పదు అని ఈ పాత్ర తెలుపుతుంది. నిజ జీవితంలో కూడా ఎవరికి వారు గొప్ప అనుకోవడంలో తప్పులేదు. కానీ తాను మాత్రమే ప్రపంచ విజేత అని అనుకోవడం మాత్రం సమంజసం కాదు అని ఈ పాత్ర తెలుపుతుంది.