Deepika Padukone Daughter: సినీ సెలబ్రిటీల జీవితం ప్రైవేట్ గా ఉండడం అసాధ్యం. వాళ్ళు కూడా అందరి లాంటి మనుషులే, కానీ వాళ్లకు స్వేచ్ఛగా బ్రతికే అవకాశం లేదు. ఎక్కడికి వెళ్లినా ముఖం కప్పుకొని వెళ్లాల్సిందే. లేకపోతే అభిమానులు చుట్టూ ముట్టేస్తారు, వాళ్ళు ఏ పరిస్థితి లో ఉన్నారు అనేది కూడా చూడరు, వాళ్లకు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే వాళ్ళు కనిపించినప్పుడు సీక్రెట్ గా ఫోటోగ్రాఫ్స్ తీస్తారు, సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి బాగా వైరల్ చేస్తారు. ఇలా రీసెంట్ గా దీపికా పదుకొనే(Deepika Padukone) విషయం లో జరిగింది. తన కూతురు దువా తో కలిసి బయటకు వెళ్లి తిరిగి వస్తున్న సమయం లో ముంబై విమానాశ్రయం లో ఒక అభిమాని దీపికా పదుకొనే వెంటపడ్డాడు. ఆమెని సీక్రెట్ గా అనుసరిస్తూ కూతురుతో కలిసి ఉన్న సమయం లో ఫోటోలు, వీడియోలు తీసాడు.
Also Read: ఆకట్టుకుంటున్న శివ కార్తికేయన్ ‘మదరాశి’ ట్రైలర్..మురుగదాస్ విశ్వరూపం!
ఇది గమనించిన దీపికా పదుకొనే ఇలా చేయడం చాలా తప్పు, వెంటనే డిలీట్ చెయ్యి అని ఆ అభిమాని వద్దకు వచ్చి ఫైర్ అయ్యింది. దీపికా పదుకొనే చాలా జాగ్రత్తగా తన కూతురు ముఖాన్ని పబ్లిక్ కి మీడియా కి చూపించకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడుతూ వచ్చింది. కానీ మీడియా సైలెంట్ గా ఉండదు కదా, ఆమె తన కూతురుతో కనిపించినప్పుడల్లా ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. కానీ దీపికా పదుకొనే స్పెషల్ గా రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు కూడా ఈమధ్య సైలెంట్ అయిపోయారు. అలా ఎంతో జాగ్రత్తగా ఉంటూ వచ్చిన దీపికా పదుకొనే కూతురు ముఖాన్ని ఆ అభిమాని సోషల్ మీడియా లో లీక్ చేసాడు. వెంటనే దీపికా పీఆర్ టీం స్పందించి, వీడియోలను సోషల్ మీడియా నుండి తొలగించింది, కానీ అప్పటికే ఆ ఫోటోలు అనేక మంది అభిమానులకు చేరిపోయాయి. ఇలా తన కూతురు ఫోటోలు లీక్ అయ్యినందుకు దీపికా పదుకొనే చాలా బాధపడింది అట.
Also Read: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!
ఇకపోతే దీపికా పదుకొనే ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. 2018 వ సంవత్సరం లో వీళ్లిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్ళైన తర్వాత ఎన్నో పూజల ఫలితంగా ఈ దంపతులకు దువా అనే కూతురు జన్మించింది. దువా అంటే ప్రార్థన అన్నమాట. కూతురు పుట్టిన తర్వాత సినిమాలకు భారీ గ్యాప్ ఇచ్చిన దీపికా పదుకొనే ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో దీపికా కూడా రెగ్యులర్ గా పాల్గొంటుంది. ఇక రణవీర్ సింగ్ చిత్రానికి వస్తే ఆయన దురంధర్ అనే చిత్రం చేస్తున్నాడు. డిసెంబర్ 6 న ఈ సినిమా విడుదల కానుంది. అదే విధంగా ఆయన ‘డాన్ 3’ చిత్రం లో కూడా నటిస్తున్నాడు