Astrology:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల రాశిచక్రంలో మార్పులు జరిగినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. దీంతో శుభ, అశుభాలు చోటు చేసుకుంటాయి. కుజుడు రాశిని మార్చడం వల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారు. మరికొందరికి సమస్యలు రావచ్చు. అందువల్ల వారు జాగ్రత్తగా ఉండాలి. రాశుల మార్పు వల్ల కొందరికి ఇప్పటి నుంచి పట్టిందల్లా బంగారమే కానుంది. వారి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అయితే మేషం నుంచి మీనం వరకు ఏ యే రాశుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూద్దాం..

మేషం:
ఈ రాశివారి మనసు కలత చెందుతుంది. కానీ పనిపట్ల ఉత్సాహం ఉంటుంది. ఈ రాశి గల తండ్రులకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తల్లి నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు కూడా ఉంటుంది. కుటుంబంతో కలిసి ధార్మిక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచింది.
వృషభం:
వీరికి పని ప్రదేశంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆదాయంలో ఆటంకాలు ఉండొచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి యాత్రలకు వెళ్తారు. ఉద్యోగం లభిస్తుంది. స్నేహితుల సహకారం కూడా లభిస్తుంది.
మిథునం:
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు ఉంటాయి. స్నేహితుని సాయంతో ఆస్తిలో పెట్టుబడి పెట్టొచ్చు. రచన, మేధో పని కారణంగా డబ్బు వస్తుంది. ఎక్కువగా దుస్తుల కోసం ఖర్చు చేస్తారు.
కర్కాటకం:
ఇంతవరకు ఆగిపోయిన డబ్బు వస్తుంది. సోదరుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబం పెద్ద నుంచి లాభం ఉండవచ్చు. అయితే బావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి.
సింహం:
ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. దానితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. వాహన నిర్వహణపై ఖర్చులు పెరగొచ్చు. విద్యా విషయంలో సంతోషకరమైన ఫలితాలు ఉంటాయి. కొందరికి మనసులో నిరాశ, అసంతృప్తి నెలకొంటుంది.
కన్య:
వాహన నిర్వహణపై ఖర్చులు పెడుతారు. ఎక్కువగా తీపి పదార్థాలు తింటారు. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జీవిస్తారు. మనసులో నిరాశ, అసంతృప్తి నెలకొంటుంది.
తుల:
దుస్తులు, మొదలైన వాటిపై ఖర్చు పెడుతారు. కూడబెట్టిన ధనం పెరుగుతుంది. తల్లితో అభిప్రాయ బేధాలు రావచ్చు. ఉద్యోగంలో మద్దతు పెరుగుతుంది. స్థాన మార్పు సాధ్యం కావచ్చు.
వృశ్చికం:
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ సోమరితనం అధికంగా ఉంటుంది. కార్యాలయాల్లో మార్పు సాధ్యమే. తల్లి మద్దతు పొందుతారు. లాభం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహకారం ఉంటుంది.
ధనుస్సు:
యాత్రలు చేస్తారు. ఆస్తి నిర్వహణపై ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చుులు పెరగవచ్చు. సోదరుల సాయంతో శ్రమ విముక్తి చెందుతారు.
మకరం:
ఉద్యోగాల్లో అధికారుల సాయం లభిస్తుంది. తీపి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. ఉద్యోగంలో మార్పు సాధ్యమే. ఆదాయం పెరుగుతుంది. కానీ స్థలం మారే అవకాశం ఉంది.
కుంభం:
జీవన పరిస్థితులు ఆందోళనను కలిగిస్తాయి. అధికారుల మద్దతు పొందుతారు. తల్లితో విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కొన్ని వస్తువుల కొనుగోలుపై అధికంగా ఖర్చు చేస్తారు.
మీనం:
కుటుంబంతో కలిసి ధార్మిక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. స్నేహితుని సాయంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పనిరంగంలో పెరుగుదల కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో ఓపిగ్గా ఉండండి.


