T20 World Cup- India: క్రికెట్ పుట్టింది ఇంగ్లండ్‌లో అయినా.. ఇండియాలో ఉన్నత క్రేజ్ ప్రపంచంలో ఏ దేశంలో ఉండదంటే అతిశయోక్తి కాదు. క్రికెట్‌ను ఆరాధ్య క్రీడగా, క్రికెటర్లను క్రీడా దేవుళ్లుగా చేసే అభిమానులు ఇండియాలో కోట్ల మంది ఉన్నారు. మరోవైపు ప్రపంచ క్రికెట్ బోర్డుల్లో అత్యంత సంపన్నమైనది కూడా ఇండియాదే. భారత క్రికెటర్లకు కూడా అంతే రేజ్‌లో వేతనాలు చెల్లిసోతంది. ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయి కూడా దీనికి ఉంది. క్రికెటర్లు కూడా అభిమానుల అంచనా మేరకు ఆటతీరుతో అలరిస్తూ విజయాలు సాధిస్తుర్నారు. అయితే టీ–20 ప్రపంచక కప్ జరుగనున్న వేళ వరుస వైఫల్యాలు టీం ఇండియాను పరేషాన్ చేస్తున్నాయి. జట్టులో సమష్టిలోపం, సారథ్య వైఫల్యంతో అనిశ్చితి నెలకొనడం క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

హీరో నుంచి జీరోగా..
ఆసియా కప్ 2022 టోర్నమెంట్ ఆరంభం అయ్యే వరకూ టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ.. అభిమానుల దృష్టిలో హీరో.. సూపర్ మేన్.. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా జట్టును ఒడ్డుకు చేర్చగలిగే సామర్థ్యం ఉన్న సారథి. ఆసియా కప్ తొలి రెండు మ్యాచ్‌ల తరువాత అతనిపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఆకాశాన్నంటాయి. గ్రూప్ దశ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ను మట్టి కరిపించడం రోహిత్ శర్మను కోట్లాదిమంది అభిమానులకు ఆరాధ్యుడిని చేశాయి. అదే దూకుడుతో హాంకాంగ్‌ను ఓడించడంతో అంచనాలు మిన్నంటాయి. ఇదంతా ఆసియా కప్ 2022 టోర్నమెంట్ గ్రూప్ దశ ముగిసేంత వరకే. సూపర్ 4లో టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌లు అతణ్ని పాతాళానికి తొక్కేశాయి. ఆసియా కప్ నుంచే జట్టు నిష్క్రమణతో హీరోగా ఉన్న రోహిత్ శర్మ అభిమానుల దృష్టిలో జీరోగా మారిపోయారు. అభిమానం పాలపొంగులా మారిపోయింది.
పెరిగిపోతున్న అసహనం..
ఆసియా కప్‌లో భారత జట్టు వైఫల్యం ప్రభావం సారథి రోహిత్ శర్మపై పడుతోంది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ స్పోర్టివ్‌నెస్ కోల్పోతోన్నాడని, ఫీల్డ్‌లో వ్యక్తిగతంగా అగ్రెసివ్‌నెస్ కనపర్చుతున్నాడని అంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థిని ఓడించడంలో, బౌలింగ్‌ను తుత్తునీయలు చేయడంలో చూపించాల్సిన దూకుడు వైఖరిని సొంత జట్టు ప్లేయర్ల మీద ప్రదర్శించడాన్ని క్రికెట్ అభిమానులతోపాటు సీనియర్ క్రీడాకారులు కూడా తప్పు పడుతున్నారు.
జట్టును నడిపించడంలో వైఫల్యం..
సారథిగా భారత క్రికెట్ జట్టును నడిపించడంలో రోహిత్ శర్మ విఫలమౌతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గెలిచినప్పుడు సంబురాలు చేసుకోవడం, ఓడినప్పుడు అసహనం వ్యక్తం చేయడం సారథి లక్షణం కాదని స్పోర్ట్స్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నాడు. సారథి అనేవాడు గెలిచిన సమయంలో కంటే ఓడిన సమయంలో హుందాగా ఉండాలని సూచిస్తున్నారు. వైఫల్యాలను గుర్తిస్తూ జట్టును ముందుకు నడపించే వాడే సమర్థవంతమైన నాయకుడు అవుతాడని పేర్కొంటున్నారు. అలాంటి నాయకుడి సారథ్యంలో స్పోర్టివ్‌గా ఆడేందుకు క్రీడాకారులు కూడా ఉత్సాహం చూపుతారని అంటున్నారు. అసహనం, అసంతృప్తి, దూషణకు దిగడం లాంటి పరిణామాలు సహచరల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

ఫీల్డ్‌లో అసౌకర్యంగా…
ఫీల్డ్‌లో రోహిత్ శర్మ అసౌకర్యంగా ఉంటున్నాడని పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానించాడు. గట్టిగా అరుస్తూ కనిపిస్తోన్నాడని, ఇది మంచిది కాదని పేర్కొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ క్యాచ్‌లు డ్రాప్ చేసిన తరువాత రోహిత్ శర్మ ప్రదర్శించిన ఆగ్రహావేశాలు, అగ్రెసివ్‌నెస్– టీమిండియా క్యాంప్‌లో అస్థిరతకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ముందు అలాంటి పరిస్థితులు ఏ జట్టుకు కూడా మంచిది కాదని పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో టీమిండియా మరీ అంత అధ్వాన్నంగా ఆడిందని తాను అనుకోవట్లేదని వెల్లడించాడు. అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయారని తెలిపాడు. నేలకు రాలిన ప్రతీసారీ భారత జట్టు మళ్లీ అదే వేగంతో పైకి లేస్తుందని, టీ20 ప్రపంచకప్‌కు సన్నాహాలు చేస్తుందని చెప్పాడు. ఈ ఓటముల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం జట్టుకు ఉందని, తుదిజట్టులో ఎలాంటి ప్లేయర్లను తీసుకోవాలనడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పాడు.