T20 world Cup 2022- Ashwin: మన్కడింగ్.. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే నాన్స్ స్ట్రైకింగ్ ఎండ్ రన్ అవుట్.. దీని పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు జరుగుతున్నప్పుడు జాస్ బట్లర్ ను మన్కడింగ్ ద్వారా రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేశాడు. అప్పట్లో పెద్ద వివాదానికే తెరలేపాడు.. ఆ తర్వాత మన్కడింగ్ ను చట్టబద్ధం చేస్తూ నిబంధన తీసుకురావడంతో అశ్విన్ చర్యను అప్పట్లో క్రికెట్ ఆటగాళ్లు మొత్తం సమర్థించారు.. ఆ తర్వాత ఆ ప్రక్రియ ను వివిధ దేశాల క్రికెట్ బోర్డులు అమలు చేస్తూ వచ్చాయి.. తాజాగా టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో టీం ఇండియా స్పిన్నర్ అశ్విన్ కు మరోసారి మన్కడింగ్ చేసే అవకాశం లభించింది.. అది కూడా సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ మిల్లర్ ది. అయితే ఈసారి రన్ అవుట్ చేయకుండా కేవలం హెచ్చరికతోనే అశ్విన్ వదిలిపెట్టాడు.

ఏమైందంటే
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య హోరాహోరి టి20 క్రికెట్ పోరు జరుగుతున్నప్పుడు… ఇన్నింగ్స్ 18 ఓవర్లో రవిచంద్రన్ బౌలింగ్ చేస్తున్నాడు.. ఓవర్లో అశ్విన్ చివరి బంతిని వేయడానికి ముందే నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న మిల్లర్ క్రీజు బయట ఉన్నాడు. ఇది గమనించిన అశ్విన్ బంతి వేయడం ఆపేసి… “యువర్ అవుట్ ఆఫ్ క్రీ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే క్రికెట్ నిబంధనల ప్రకారం అశ్విన్ మిల్లర్ ను రన్ అవుట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ వదిలేశాడు.. దీనిని క్రీడా స్ఫూర్తిగా మాజీ క్రికెటర్లు పరిగణిస్తున్నారు.. అయితే రవిచంద్రన్ చేసిన పని పట్ల భారత క్రికెట్ అభిమానులు అంతగా సంతోషంగా లేరు. ఎందుకంటే అప్పటికే మిల్లర్ తన జట్టును విజయం వైపు నడిపిస్తున్నాడు.. కిల్లర్ మిల్లర్ గా గుర్తింపు పొందిన అతను ఉంటే మ్యాచ్ కచ్చితంగా గెలిపిస్తాడు. మధ్యలోనే మిల్లర్ ను రన్ అవుట్ చేసి ఉంటే బాగుండేదని అభిమానులు పేర్కొన్నారు..

ఎందుకంటే ఇది కూడా వాస్తవమే.. తర్వాత మిల్లర్ మూడు ఫోర్లు సాధించి సౌత్ ఆఫ్రికా జట్టను విజయతీరాల వైపు నడిపించాడు.. ఒకవేళ అశ్విన్ మన్కడింగ్ చేసి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది. అందుకే అభిమానులు “అశ్విన్.. నువ్వు మిల్లర్ ను వదిలేసి పెద్ద తప్పు చేశావు.” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. ఇక మీమ్స్ కైతే అడ్డు అదుపు లేదు. అయితే దక్షిణాఫ్రికా తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇండియాకు వచ్చిన నష్టమేమీ లేదు. ఇది పాకిస్తాన్ సెమిస్ వెళ్లే దారులను పూర్తిగా మూసివేసింది.