Chanakya Niti : జీవితంలో ఏదైనా సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొందరు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు. మిగతా వారు వారిని చూసి అసూయపడుతారు. కానీ వారు ఎందుకు సాధించలేకపోతున్నారో గ్రహించాలి. విజయాన్ని చేరుకున్న వారి అలవాట్లు ఏంటి? వారు ఏ విధంగా జీవితంలో ప్రణాళికలు వేసుకున్నారు? వంటి విషయాలను తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలను చాణక్యుడు ఆ కాలంలోనే చెప్పారు. మౌర్యుల కాలంలో చాణక్యుడు రాజనీతి బోధనలు చేసి రాజ్యాన్ని సక్రమంగా నడిపించారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన సూత్రాలు చెప్పి వారి అభివృద్ధికి తోడ్పినాడు. అపర చాణక్యుడు చెప్పిన కొన్ని సూత్రాల ప్రకారం కొన్న విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకూడదట. వాటిని ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల జీవితంలో ఎదుగుదలకు అడ్డుకట్టలు ఏర్పడుతాయట. ఆ విషయాలు ఏంటంటే?
ప్రతి మనిషి దగ్గర కొన్ని రహస్యాలు ఉంటాయి. కొందరు భోళా మనిషిలా ప్రతి విషయాన్ని ఇతరులకు చెప్పుకుంటారు. మరికొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా రహస్యాలు బయటపెట్టరు. ఇలా రహస్యాలు బయటపెట్టని వారు ఆలోచనాత్మకంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. అయితే ఇప్పటి వరకు ప్రతీ విషయాన్ని చెప్పినా.. ఇక నుంచి మాత్రం ఈ 5 విషయాలను ఎవరికి చెప్పొద్దని చాణక్య నీతి చెబుతుంది.
కొందరు వ్యక్తులు తమ సొంత విషయాలను ఇతరులతో పంచుకుంటారు. తమకున్న అలవాట్లు, ఫీలింగ్స్ గురించి షేర్ చేసుకుంటారు. అయితే మంచి స్నేహితులు అయితే పర్వాలేదు. కానీ శత్రువులు మాత్రం వీటిని ఆసరాగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. మీ వ్యక్తిగత ఫీలింగ్స్ ను ఆధారంగా చేసుకొని ఒక్కోసారి ఆర్థిక విషయాల్లో కూడా అడ్డుపడే అవకాశం ఉంది.
వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను స్నేహితులతోకూడా చెప్పుకోవద్దు. ఎందుకంటే వారిలో అందరూ అర్థం చేసుకునేవారు ఉండకపోవచ్చు. కొందరు ఈ సమస్యలు బహిర్గతం చేయడం వల్ల మానసికంగా చిక్కులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా జీవిత భాగస్వామికి వ్యతిరేక భావన ఏర్పడుతుంది.
ప్రతి వ్యక్తికీ బలం, బలహీనతలు ఉంటాయి. బలహీనతల గురించి ఇతరులకు చెప్పొద్దు. ఈ బలహీనతల ఆధారంగా మీపై శత్రువులు దాడి చేసే అవకాశం ఉంది. ఇవి ఇతరులకు చెప్పుకోవడం వల్ల చులకనగా మారుతాయి. అందువల్ల బలహీనతల గురించి జీవిత భాగస్వామి వద్ద కూడా చెప్పే ప్రయత్నం చేయొద్దు.
భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని చేసే ప్రయత్నాలు ఇతరులకు చెప్పొద్దని చాణక్య నీతి చెబుతుంది. ఈ విషయం బహిర్గతం కావడం వల్ల మీ ప్రణాళికను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా కొందరు వాటిని అడ్డుకొని గమ్యాన్ని చేరకుండా చేస్తారు.
ఫైనాన్స్ విషయంలో రహస్యం పాటించాలి. ఒక వ్యక్తి తన వద్ద ఎంత డబ్బు ఉన్నది? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? అనే విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఉండడం వల్ల మీపై ఇతర భావన ఏర్పడుంది. కొందరు శత్రువులు మీ నుంచి డబ్బు ఆశించడానికి ప్రయత్నిస్తారు. ఇలా మీరు డబ్బు ఇస్తేనే స్నేహం చేస్తామని ధోరణి కొందరిలో ఉంటుంది.