https://oktelugu.com/

Brain cancer : రోజూ మొబైల్ ఎక్కువగా వాడితే.. బ్రెయిన్ కాన్సర్ వస్తుందా? దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందంటే?

డాక్టర్లు కంటే గూగుల్, సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముతారు. డాక్టర్ ఇచ్చిన మందులను వాడరు. కానీ గూగుల్, యూట్యూబ్ లో చూసినవి తప్పకుండా వాడుతారు. ఇలా డాక్టర్ పర్మిషన్ లేకుండా మందులు వాడటం అంత మంచిది కాదు. అయితే మరీ ఎక్కువగా మొబైల్ వాడితే నిజంగానే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందో మరి పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 4, 2024 1:06 pm
    Brain cancer

    Brain cancer

    Follow us on

    Brain cancer :  ఈరోజుల్లో చాలా మంది మొబైల్ వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా మొబైల్ వాడుతున్నారు. ఎక్కడ చుసిన ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్ తో కనిపిస్తారు. అయితే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం వాళ్ల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు.. కళ్లు దెబ్బతింటాయని వైదులు చెబుతుంటారు. అలాగే మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటుంటుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో ఓ వార్త ట్రెండ్ అవుతుంది. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని తెగ వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియా లో ఏదయినా ట్రెండ్ అయితే అదే నిజం అని కొందరు నమ్ముతారు. డాక్టర్లు కంటే గూగుల్, సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముతారు. డాక్టర్ ఇచ్చిన మందులను వాడరు. కానీ గూగుల్, యూట్యూబ్ లో చూసినవి తప్పకుండా వాడుతారు. ఇలా డాక్టర్ పర్మిషన్ లేకుండా మందులు వాడటం అంత మంచిది కాదు. అయితే మరీ ఎక్కువగా మొబైల్ వాడితే నిజంగానే బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా? దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పిందో మరి పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

    మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. దీనిపై తాజాగా డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం చేసింది. అసలు బ్రెయిన్ క్యాన్సర్ కి, మొబైల్ రేడియేషన్ కి సంబంధం లేదని తెలిపింది. మొబైల్ ఫోన్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ ముప్పు పెరిగడానికి లింక్ లేదని ఆ అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగింది. కానీ బ్రెయిన్ క్యాన్సర్ల పెరుగుదల అయితే మాత్రం అంత ఎక్కువ స్థాయిలో లేదని తాజాగా అధ్యయనం తెలిపింది. ఇది కేవలం మొబైల్ ఫోన్ వాడే వాళ్లకు మాత్రమే కాకుండా.. గంటల తరబడి కాల్స్ మాట్లాడే వాళ్లకి కూడా వర్తిస్తుంది. అయితే మొబైల్ రేడియేషన్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మొత్తం 10 దేశాలకు చెందిన 11 మంది పరిశోధకులు ఏళ్ల పాటు 63 అధ్యయనాలు చేసి పరిశీలించి చెప్పారు. మొబైల్ వల్ల వ్యాధులు ఏవైనా వస్తాయా అనే దాని మీద ఇంకా అధ్యయనాలు తప్పనిసరి అని తెలిపారు.