Jayshree Ullal Net Worth: సత్య నాదెళ్ల.. ఇండియన్ కార్పొరేట్ ప్రపంచం మాత్రమే కాదు ప్రపంచ కార్పొరేట్ అధిపతులకు కూడా పరిచయం అక్కరలేని పేరు. భారత మూలాలు ఉన్న ఈ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఏడాదికి వందల కోట్లలో వేతనాన్ని స్వీకరిస్తున్నారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ గ్రూపులో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. పైగా ప్రపంచ దేశాల అధిపతులతో భేటీలు అవుతూ కార్పొరేట్ ప్రపంచానికి కొత్త తరహా వ్యాపార విధానాన్ని పరిచయం చేస్తున్నాడు. అలాంటి సత్య నాదేళ్లతో ఓ మహిళ పోటీ పడింది. పై చేయి సాధించింది. అంతకుమించి అనేలాగా ఆస్తులు సంపాదించి సత్య నాదెళ్ళను ముక్కున వేలు వేసుకునేలా చేసింది.
భారత సంతతికి చెందిన మహిళ
సత్య నాదెళ్ళతో పోటీపడి ఆస్తులు సంపాదించిన మహిళ పేరు జయ శ్రీ ఉల్లాల్. ఈమె భారత సంతతికి చెందిన మహిళ. యూకే లో జన్మించినప్పటికీ ఢిల్లీలో పెరిగింది. ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసి, తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత శాంటా క్లాస్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. చదువు పూర్తి అయిన తర్వాత ఆమె అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ విభాగంలో ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ఉంగర్ మాన్ బాస్ లో నాలుగు సంవత్సరాలు గడిపింది. ఆ తర్వాత కొన్ని రోజులకే క్రెసిండో కమ్యూనికేషన్స్ లో చేరింది. చివరికి తీసుకో కంపెనీలో ఉద్యోగ మారింది. 15 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో సిస్కో కంపెనీలో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించింది.
సీఈఓ గా కూడా
జయశ్రీ 2008 నుంచి అరిష్టా నెట్వర్క్ కి ప్రెసిడెంట్ గా మాత్రమే కాకుండా సీఈఓ కు కూడా పనిచేసింది. కేవలం సీఈవో మాత్రమే కాదు అంతకుమించి అనేలాగా సంపాదించింది. ఆమె సంపాదన ఎంతలా ఉందంటే ఏకంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళను మించిపోయింది. ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం వ్యక్తిగత సంపద విషయంలో ఈమె భారత దేశంలో అత్యంత ధనికురాలు. ఇక సంపద విషయంలో ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ళ కంటే ముందు వరుసలో ఉంది. ఇక ఈమె వ్యక్తిగత ఆస్తులు మొత్తం 3.4 లక్షల కోట్లు. ఈమె సి బెడ్ సంస్థ ఫౌండర్ అండ్ సీఈవో విజయ్ ఉల్లాల్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులు కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నికర ఆస్తుల విలువ 6,200 కోట్లు. ఇక సుందర్ పిచాయ్ ఆస్తుల విలువ కూడా దాదాపు 6000 కోట్లు ఉంటుంది. కానీ ఇదే సమయంలో జయశ్రీ సంపద పదివేల కోట్లకు చేరువలో ఉండడం విశేషం. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా సామాజిక సేవలు కూడా జయశ్రీ ముందు ఉంటుంది. చారిటీ సంస్థను ఏర్పాటు చేసి అనాధ పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తుంది. చాలామందికి ఆడవారు ఏమీ చేయలేని అపోహ ఉంటుంది. కానీ ఒకసారి వారు మనసు లగ్నం చేస్తే చేయలేనిది అంటూ ఏమీ ఉండదు. అందుకు జయశ్రీ జీవితమే ఒక ఉదాహరణ.