https://oktelugu.com/

Bichagadu 2 Movie OTT: అప్పుడే ఓటీటీ లోకి ‘బిచ్చగాడు 2’..ఇదేమి ట్విస్ట్ సామీ!

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి రెండు రోజుల్లోనే 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కు కూడా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Written By:
  • Vicky
  • , Updated On : May 21, 2023 / 01:56 PM IST

    Bichagadu 2 Movie OTT

    Follow us on

    Bichagadu 2 Movie OTT: రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి టాక్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ లేటెస్ట్ చిత్రం ‘బిచ్చగాడు 2’ కి ఓపెనింగ్స్ పరంగా కళ్ళు చెదిరే రేంజ్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. కేవలం మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు. రీసెంట్ గా విడుదలైన ఏ తెలుగు సినిమాకి కూడా ఇంత ఓపెనింగ్ రాకపోవడం విశేషం.

    ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి రెండు రోజుల్లోనే 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ మార్కు కూడా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    ఇప్పటికీ ఈ సినిమా తూర్పు గోదావరి జిల్లాలో నిన్నటితో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది. ఈరోజు నుండి మొత్తం లాభాలే అట. ఇంత సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా అప్పుడే ఓటీటీలో విడుదల అవ్వబోతుందని అంటున్నారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం వచ్చే నెల 12 వ తారీఖున డిస్నీ + హాట్ స్టార్ లో తెలుగు మరియు తమిళ బాషలలో స్ట్రీమింగ్ కాబోతుందట.

    ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే సమయానికి ఈ చిత్రం రన్ కూడా అవ్వొచ్చని, ఒకవేళ రన్ ఇంకా కొనసాగితే ఓటీటీ విడుదల తేదీ పొడిగించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక బిచ్చగాడు 2 మూడవ రోజు కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తూ. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడవ రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తుందని అంటున్నారు, చూడాలి మరి.