
Pop Singer Arjit Singh : టీమిండియాకు మూడు ట్రీఫీలు అందించిన ఘనత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదే. అందుకే క్రికెట్లో అతడిని మహరాజుగా చూస్తారు. ప్రస్తుతం ఐపీఎల్ సమరం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ కు మరోమారు పండగ వచ్చేసింది. ఇక కొద్ది రోజులు అందరికి సంబరమే. ఒకప్పుడు సచిన్ కు ఉన్న ఇమేజ్ ఇప్పుడు ధోనీకి రావడం సహజమే. దీంతో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభ మ్యాచ్ లో ధోనీకి దక్కిన గౌరవం అభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది. ధోనీ కాళ్లు ఓ సెలబ్రెటీ మొక్కడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది.
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా అహ్మదాబాద్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో తమన్నా, రష్మికలు స్టెప్పులు వేయడంతో అందరిలో జోష్ నింపింది. దీనికి హిందీ పాప్ సింగర్ అర్జిత్ సింగ్ తన పాటలతో కొత్త ఊపు తీసుకొచ్చాడు. స్టేడియంలో ఉన్న అందరిని తన సాంగ్స్ తో కొత్త లోకంలోకి తీసుకెళ్లాడు. అతడు బ్రహ్మాస్త్ర సినిమాలో దేవా దేవా పాట పాడుతున్న సమయంలో ధోనీని చూపించాడు. ఇక అప్పుడు ఫ్యాన్స్ అరిచి గోల గోల చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

స్టేజీ పర్ఫార్మెన్సులు పూర్తయ్యాక చెన్నై కెప్టెన్ ధోనీ స్టేజీ మీదకు వచ్చాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న స్టార్ పాప్ సింగర్ అర్జిత్ సింగ్ ధోనీ పాదాలను తాకాడు. అతడి కాళ్లకు మొక్కడం సంచలనం కలిగించింది. క్రికెటర్లకు ఫ్యాన్స్ ఉండటం సహజమే. కానీ ఈ పాప్ సింగర్ కూడా మంచి సెలబ్రిటీనే. కానీ ధోనీ పాదాలకు మొక్కడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీంతో ధోనీ అభిమానుల ఆనందాలకు అవధులకు అంతేలేకుండా పోయింది. ధోనీ అభిమానులు దీనికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు.
అయితే తొలిమ్యాచ్ లో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో చెన్నైపై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఇక్కడ అర్జిత్ సింగ్ ధోనీ పాదాలకు మొక్కడమే వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అర్జిత్ సింగ్ ధోనీ పాదాలకు మొక్కడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా నిలుస్తోంది. ధోనీ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. క్రికెటర్ గా ధోనీకి దక్కిన గౌరవానికి అంతా ఉప్పొంగిపోతున్నారు. సచిన్ కు ఉన్న రెస్పాన్స్ ఇప్పుడు ధోనీ వైపు మళ్లిందని అనుకుంటున్నారు.

అర్జిత్ సింగ్ మహేంద్ర సింగ్ ధోనీకి అభిమాని. అతడి ఆటంటే అతడికి ప్రాణం. అందుకే అతడిని నేరుగా కలవడంతో సంతోషం పట్టలేక అతడి పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. ధోనీ వారించినా కాళ్లు పట్టుకుని తన కోరిక తీర్చుకున్నాడు. ఉత్తరాది పాప్ సింగర్లలో అర్జిత్ సింగ్ కూడా ఒకరు. ఆయన పాటంటే అందరికి ఎంతో ఇష్టం. దీంతో ఇద్దరు సెలబ్రెటీలు ఒకే స్టేజీ మీద పాలుపంచుకోవడంతో ఇద్దరిని ఒకే వేదిక మీద చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.