https://oktelugu.com/

Cabbage: క్యాబేజీ కర్రీ చేస్తున్నప్పుడు ఈ పొరపాటు చేస్తే మాత్రం అనారోగ్యం పాలవ్వాల్సిందే?

Cabbage: సాధారణంగా సీజన్ లతో సంబంధం లేకుండా మార్కెట్లలో లభించే కూరగాయలలో క్యాబేజి ఒకటి. ఈ క్యాబేజీతో వివిధ రకాల ఆహార పదార్థాలను,సలాడ్లను తయారు చేస్తాము. అలాగే చాలామంది క్యాబేజీతో గోబీ మంచూరియా కూడా తయారు చేస్తుంటారు. ఇలా వివిధ రకాలుగా తయారు చేసుకునే క్యాబేజీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. క్యాబేజీతో ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. క్యాబేజీలో మన కంటికి కనిపించని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 2, 2021 5:19 pm
    cabbage-curry
    Follow us on

    Cabbage: సాధారణంగా సీజన్ లతో సంబంధం లేకుండా మార్కెట్లలో లభించే కూరగాయలలో క్యాబేజి ఒకటి. ఈ క్యాబేజీతో వివిధ రకాల ఆహార పదార్థాలను,సలాడ్లను తయారు చేస్తాము. అలాగే చాలామంది క్యాబేజీతో గోబీ మంచూరియా కూడా తయారు చేస్తుంటారు. ఇలా వివిధ రకాలుగా తయారు చేసుకునే క్యాబేజీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. క్యాబేజీతో ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

    Cabbage

    Cabbage

    క్యాబేజీలో మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు పెరుగుతూ ఉంటాయి. వీటిని పరాన్నజీవులు అంటారు. పరాన్నజీవులు అంటే ఇతర శరీరంలో మనుగడ సాగించేవి అని అర్థం. ఇలా క్యాబేజీలో ఎన్నో రకాల సూక్ష్మ జీవులు ఉంటాయి మనం దానిని శుభ్రం చేయకుండా కర్రీ చేయడం వల్ల సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించి వాటి మనుగడను పెంపొందిస్తాయి. ఈ విధమైనటువంటి పరాన్నజీవులను టేప్ వార్మ్స్ అంటారు.

    Also Read: టీ తాగిన తర్వాత పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలను తినకండి.. ఎదుకంటే?

    మనం క్యాబేజీని చేసేటప్పుడు శుభ్రంగా నీటిలో కడగకుండా సరిగా శుభ్రం చేయకుండా తయారు చేయడం వల్ల టేప్ వార్మ్స్ మన శరీరంలోకి ప్రవేశించడమే కాకుండా రక్తనాళాల్లోకి కూడా ప్రవేశించి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. అందుకోసమే క్యాబేజీ తయారుచేసే సమయంలో ముందుగా క్యాబేజీ కత్తిరించి నీటిగా శుభ్రం చేయాలి. అలాగే క్యాబేజీని తరిగిన తర్వాత పదిహేను నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టి అనంతరం కర్రీ చేయాలి. అయితే ఈ కర్రీ చేసే సమయంలో బాగా ఉడక పెట్టడం వల్ల అందులో ఉన్నటువంటి పరాన్నజీవులు చనిపోతాయి. కనుక క్యాబేజీ కర్రీ చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకుని చేయడం ఎంతో ఉత్తమం.

    Also Read: మీరు ఆస్తమాతో బాధ పడుతున్నారా.. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?