Indian Railways: భారతీయ రైల్వే వ్యవస్థలోని నిబంధనల గురించి తెలుసుకోవాలి. మనకు ఎన్నో సదుపాయాలు కల్పించి సురక్షిత ప్రయాణం చేసేందుకు శాఖ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. కానీ మనకు ఏవీ తెలియవు. దీంతో నష్టపోవాల్సివ వస్తోంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని కచ్చితంగా పాటిస్తే మనకు ఏ ఇబ్బందులు తలెత్తవు అనే సంగతి మరచిపోకూడదు. మనం తరచూ రైల్వే ప్రయాణాలు చేస్తుంటే మనం కచ్చితంగా నియమ నిబంధనలు తెలుసుకోవాల్సిందే. లేకపోతే మనకు అన్యాయం జరిగితే ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉండదు.
మనం రైల్వే ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రూల్స్ తెలుసుకుంటే మంచిది. ఒక వేళ మనం ప్రయాణం చేసేటప్పుడు మన లగేజీ కనుక పోతే మనం తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ విషయం ఎవరికి తెలియదు. దీంతో నష్టపోతుంటారు. రైల్వేలో ప్రయాణించే సమయలో మన లగేజీ గల్లంతయితే కచ్చితంగా తిరిగి పొందే వీలుంది. దీనికి మనం చేయాల్సిందల్లా సమీప రైల్వే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి.
Also Read: ఈ ఫొటోలో ఉన్న జంతువుని కనిపెట్టగలరా ? తెలివైన వారు మాత్రమే చెప్పగలరు ..!
దీంతో ఏఏ వస్తువులు కనిపించకుండా పోయాయి? ఎక్కడ పోయాయి? అనే పూర్తి వివరాలు ఎఫ్ఐఆర్ లో పొందు పరచాలి. దీంతో ఆరు నెలల్లోపు మీ వస్తువుల మీకు తిరిగి రాకపోతే అప్పుడు మనం వినియోగదారుల ఫోరంలో కేసు వేయొచ్చు. దాని ఆధారంగా మనం పోయిన వస్తువులకు పరిహారం పొందవచ్చు. ఈ విషయంపై అందరికి స్పష్టత ఉంటే ఎవరు కూడా పోయిన వస్తువులను తిరిగి పొందేందుకు కష్టపడాల్సిన పనిలేదు.
మరోవైపు రైలు ప్రయాణంలో కొన్ని విషయాలను విస్మరించకూడదు. టికెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు. వెయిటింగ్ టికెట్ పై రిజర్వేషన్ కోచ్ లో ప్రయాణం చేయడం నేరమే. ఒకవేళ దొరికితే రూ.250 జరిమానా విధిస్తారు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ట్యాంపరింగ్ ట్రైన్ టికెట్ జర్నీ చేస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ 137 జీవో ప్రకారం కేసు నమోదు చేస్తారు. రూ. వెయ్యి జరిమానా విధించొచ్చు. అందుకే రైలు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే.
Also Read: ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఇండియన్ ఐడల్ విన్నర్ రేవంత్.. ఫోటోలు వైరల్!