Swimming : శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. అయితే ఈ వ్యాయామం రకరకాలుగా ఉంటుంది. కొందరు వర్క్ అవుట్ లు చేస్తూ తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటారు. మరికొందరు వాకింగ్ చేస్తూ శరీరాన్ని సమతుల్యం చేసుకుంటారు. అయితే మిగతా వ్యాయామాల కంటే స్విమ్ చేయడం వల్ల అన్ని రకాల వ్యాయామం చేసినట్లు అవుతుంది. Swim చేయడం వల్ల శరీరంలోని కండరాలు కదలికలు ఏర్పడతాయి. దీంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా వేసవిలో స్విమ్ చేయడం వల్ల శరీరాన్ని చల్ల పరుచుకోవచ్చు. అయితే స్విమ్మింగ్ వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో.. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అంతకుమించి నష్టాలు కూడా ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇప్పుడు చూద్దాం.
సిమ్మింగ్ చేసేముందు వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకోవాలి. వర్షం పడే సమయంలో లేదా చలి ఎక్కువగా ఉన్న సమయంలో swim చేయడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలను వర్షాకాలంలో స్విమ్మింగ్ చేయకుండా ఆపాలి. అయితే వేసవికాలంలో అనుగుణంగా ఉంటుంది. ఈ సమయంలో స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. అంతేకాకుండా మనసు ప్రశాంతంగా మారుతుంది.
స్విమ్మింగ్ పూల్ లోకి దిగేముందు నీటి నాణ్యత గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు నీళ్లలో ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ నీరు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నీటి నాణ్యత సరిగా లేకపోతే.. సంబంధిత యజమానులకు తెలియజెప్పాలి. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్ లో నీటి నాణ్యత కోసం క్లోరినేషన్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో స్విమ్మింగ్ పూల్ లోకి దిగేముందు షవర్ బాత్ చేయడం అవసరం. అలాగే స్విమ్మింగ్ పూర్తి అయిన తర్వాత కూడా స్నానం చేయాల్సి ఉంటుంది. లేకుంటే శరీరంపై క్లోరినేషన్ అలాగే ఉండిపోతుంది.
రక్తపోటు అధికంగా ఉన్నవారు స్విమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వేగంగా స్విమ్మింగ్ చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విరామం ప్రకటిస్తూ స్విమ్మింగ్ చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
స్విమ్మింగ్ పూల్ కు వెళ్లగానే చాలామందికి ఉత్సాహం ఉరకలేస్తుంది. ముఖ్యంగా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఎగిరి గంతులేస్తూ పరిగెడతారు. ఇలా చేయకుండా నివారించాలి. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ చుట్టూ వాటర్ ఉంటుంది. దీంతో కాలుజారి స్విమ్మింగ్ పూల్ లోకి పడే అవకాశం ఉంటుంది. అందువల్ల పిల్లలు లేదా ఈత రాణి వారు దీని చుట్టూ పరిగెత్తకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి.
స్విమ్మింగ్ పూల్ లోకి దిగే సమయంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించడం తప్పనిసరి. లేకుంటే నీటిలోని కొన్ని క్రిములు శరీరంపై అలాగే ఉండిపోయి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అలాగే కళ్ళకు రక్షణగా గాగుల్స్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే నీటిలో ఉండే క్లోరినేషన్తో కళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇవే కాకుండా కొత్తగా స్విమ్మింగ్ నేర్చుకునే వారు నిపుణుల సమక్షంలో ఉండాలని చెబుతున్నారు.