Nithiin dual role: మీడియం రేంజ్ హీరోలలో చాలా కాలం నుండి డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటున్న నటుడు నితిన్(Actor Nithin). ఈయన నటించిన చివరి సూపర్ హిట్ చిత్రం ‘భీష్మ’. ఆ తర్వాత ఈయన చేసిన ‘రంగ్ దే’,’చెక్’,’మాచెర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ వంటి చిత్రాలు ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. సాధారణంగా ఒక మీడియం రేంజ్ హీరో కి ఒక ఫ్లాప్ వస్తేనే తట్టుకోవడం కష్టం, అలాంటిది వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ అంటే ఇక అర్థం చేసుకోవచ్చు నితిన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అనేది. ఆయన గత చిత్రం ‘తమ్ముడు’ కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా తర్వాత నితిన్ తో ‘ఎల్లమ్మ’ అనే చిత్రం చెయ్యాలి. కానీ ‘తమ్ముడు’ ఫ్లాప్ అవ్వడం తో ‘ఎల్లమ్మ’ నుండి నితిన్ ని తప్పించాడు.
కేవలం దిల్ రాజు మాత్రమే కాదు, ఇండస్ట్రీ లో ఏ నిర్మాత కూడా ఇప్పుడు నితిన్ కి రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమా చేసే పరిస్థితిలో లేరు. దీంతో నితిన్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా, సినిమా విడుదలై థియేటర్స్ లో లాభాలు వచ్చిన తర్వాతనే ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చేసాడు. అయితే నితిన్ గత రెండు ఫ్లాప్ చిత్రాల నుండి చాలా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి సినిమాలు చెయ్యాలో తెలుసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన VI ఆనంద్ దర్శకత్వం లో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు టాక్. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఉంటుందట. ఈ చిత్రం లో నితిన్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. హీరోయిన్స్ కూడా ఇందులో ఇద్దరు ఉంటారట. నితిన్ కి డ్యూయల్ రోల్ చేయడం కొత్తేమి కాదు. గతం లో ఆయన ‘సై’ లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ‘అల్లరి బుల్లోడు’ అనే చిత్రం చేసాడు.
ఇందులో నితిన్ డ్యూయల్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంతటి ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత వరుసగా ఆయన 14 ఫ్లాప్స్ అందుకున్నాడు. అలాంటిది ఇప్పుడు మళ్లీ తనకు అచ్చి రానటువంటి డ్యూయల్ రోల్ సెంటిమెంట్ తోనే కం బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా తో నితిన్ ఎలా భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా బలంగా కోరుకుంటున్నాడు నెటిజెన్స్. తన మార్కెట్ మొత్తం జీరో అయిపోయినప్పటికీ కూడా నితిన్ ‘ఇష్క్’ తో భారీ కం బ్యాక్ ఇచ్చి, ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్స్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. మళ్లీ ఆ రేంజ్ కి కచ్చితంగా వస్తాడనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కూడా ఉంది.