Phone charger safety tips: మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ కు పెట్టే ఛార్జింగ్ విషయంలో నిర్లక్ష్యంగా అసలు ఉండకూడదు అని కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మొబైల్ ఛార్జింగ్ పెట్టి.. ఆ తర్వాత ఫోన్ నుంచి తీసేసిన కేబుల్ ను అలాగే వదిలేసేవారు. అలా వదిలేసిన కేబుల్ చిన్న పిల్లలు నోట్లో పెట్టుకుని విద్యుత్ షాక్ తో మరణించిన సంఘటనలు ఉన్నాయి. చార్జర్లు సాకెట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే కేబుల్ లోకి విద్యుత్ సరఫరా అయ్యేది. కానీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసినా కూడా ప్రమాదమే అని కొందరు నిపుణులు అంటున్నారు. మరి సాకెట్ లో చార్జర్ ఉంటే ఏం జరుగుతుంది?
చాలామంది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత చార్జర్లు అలాగే వదిలేస్తారు. అయితే చార్జింగ్ పెట్టే సమయంలో స్విచ్ ఆన్ చేసినా.. చార్జింగ్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇలా స్విచ్ ఆఫ్ చేస్తే ఎలాంటి ప్రమాదం లేదని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఆఫ్ చేసినా కూడా సాకెట్ లో చార్జర్ ఉంటే ప్రమాదమేనని అంటున్నారు. ఎందుకంటే సాకెట్లో చార్జర్ ఉండడం వల్ల విద్యుత్ సరఫరా ఒక్కోసారి హై వోల్టేజ్ తో ఉండడంతో చార్జర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ చార్జర్ సాకెట్లో ఎక్కువసేపు ఉండటం వల్ల విద్యుత్ సరఫరాతో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా తొందరగా చార్జర్ పాడైపోయే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సాకెట్లో చార్జర్లు వదిలేయకుండా ఉండాలి. చార్జింగ్ పూర్తయిన తర్వాత చార్జర్ లో తీసేసి స్టోర్ చేయాలి.
ప్రస్తుతం మొబైల్ కొనుగోలు చేసే సమయంలో చార్జర్ ఇవ్వడం లేదు. దీంతో అదనంగా డబ్బులు చెల్లించి దీనిని కొనాల్సి వస్తుంది. అంతేకాకుండా నార్మల్ చార్జర్ ఉపయోగించడం వల్ల మొబైల్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నాణ్యమైన చార్జర్ కొనుగోలు చేయాలని అంటున్నారు. నాణ్యమైన చార్జర్ కు అధిక ధర వెచ్చించాల్సి ఉంటుంది. చార్జర్స్ అధిక ధర ఉండడంతో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువల్ల చిన్న విషయంలోనూ చార్జర్ పై నిర్లక్ష్యంగా ఉండకూడదు. చార్జర్ పాడైపోయింది అని తెలిస్తే వెంటనే నాణ్యమైన చార్జర్ కొనుగోలు చేయడం మంచిది. అంతేకాకుండా ఉన్న చార్జర్ ను కాపాడుకోవాలి.
అలాగే చార్జర్ సాకెట్ లో ఉంచి స్విచ్ ఆన్ చేసి కూడా వదిలేయకూడదు. ఇలా వదిలేయడం వల్ల ఒక్కోసారి తెలియకుండానే చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంటో విద్యుత్ త్ ప్రమాదానికి గుర అయ్యే అవకాశం ఉంది.