Symptoms of Laziness: సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. కానీ వీరులో కొంతమంది మాత్రమే అనుకున్న విజయాన్ని పొందుతారు. మరికొందరు మాత్రం ఉన్నచోటే ఉండిపోతారు. అయితే విజయం సాధించిన వారి గురించి చెప్పుకుంటూ ఉన్నచోటే ఉన్నవారు అక్కడే ఉండిపోతారు. ఇలా వీరు ఉండిపోవడానికి వీరిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిలో ప్రధానమైనది నేను చేయలేను.. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని లక్షణాల వల్ల మీరు ముందుకు వెళ్లలేరు. అయితే వారితోపాటు విజయం సాధించాలంటే కొన్ని అలవాటు చేసుకోవాలి. వాటి గురించి వివరాల్లోకి వెళితే.
నేను చేయలేను:
చాలామంది చెప్పే మాటే ఇది. ఎదుటివారు విజయం సాధిస్తే తమకు ఏదో అదృష్టం ఉందనో.. లేక సపోర్టు ఉందనో అంటారు.. కానీ వారి లా విజయం సాధించడానికి ఏమాత్రం ప్రయత్నించారు. అందుకు బద్ధకమే కారణం. నేను చేయలేను అనే బదులు.. నేను కచ్చితంగా చేస్తాను అని ప్రయత్నం ప్రారంభించినప్పుడే.. విజయం అంచులోకి వెళ్లినట్లు. అందువల్ల నేను చేయలేను అనే మాట ఎప్పుడూ అనకూడదు..
డబ్బు లేదు.. అందుకే ఉద్యోగం లేదు:
కొంతమంది ఉద్యోగం చేయలేని వారు చెప్పే మాట ఇది. తమకు ఆర్థిక పరిస్థితి బాగా లేనందున పెద్దగా చదువుకోలేదని.. దీంతో మంచి ఉద్యోగం పొందలేనని అంటూ ఉంటారు. వాస్తవానికి ఏ ఉద్యోగమైనా పొందడానికి కేవలం చదువు మాత్రమే. ఈ చదువు ఇప్పుడు అందరికీ దొరుకుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు సైతం ర్యాంకులు సాధించి కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా చదువును అభ్యసించే వారు ఉన్నారు. ఇలా ప్రయత్నించి మంచి పొజిషన్లోకి వచ్చినవారు ఉన్నారు. అందువల్ల కేవలం డబ్బు ఉంటేనే తమ జీవితం బాగుంటుందని ఎప్పుడూ అనుకోవద్దు.
అలసిపోయాను:
ఒక వయసుకు వచ్చిన తర్వాత చెప్పే మాట ఇది. కొన్ని పనులు భారంగా అనిపించడంతో తాము ఇక పనులు చేయలేమని.. అలసిపోయామని అంటుంటారు. అయితే ఇలా పనుల భారం మీద పడినప్పుడు ఒక్కో పని.. లేదా చిన్న చిన్న పనులను పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. చిన్న పనులు పూర్తి చేయడం వల్ల పెద్ద పనులు పెద్దగా భారం పడవు. పైగా పెద్ద పనులు ఒకటి రెండు మాత్రమే కనిపించడంతో వాటిని వెంటనే పూర్తి చేయడానికి ఉత్సాహం వస్తుంది. అందువల్ల నేను అలసిపోయాను.. చేయలేను అని అనుకోవద్దు..
ఆసక్తి లేదు:
కొందరు తమ ఇష్టం కొద్ది మాత్రమే పని చేయాలని అనుకుంటారు. ఒక్కో సందర్భంలో ఇది సాధ్యం కానప్పుడు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది. అయితే ఇష్టమైన పని కోసం కొన్ని రోజులు వెయిట్ చేసే అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా ముందే తనకు ఇష్టం లేదని పనులు చేయకుండా ఉంటే ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని పనులు ఇష్టం లేకున్నా వాటిని మొదలు పెడితే.. ఆ తర్వాత ఇష్టంగా చేయవచ్చు. అందువల్ల ఒక్కోసారి ఆసక్తి లేకున్నా.. అవసరం కొద్దీ పనులు చేయాలి.
పనిభారం:
ఒక్కోసారి పని భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో నిట్టూర్చకుండా ఒక్కో పని పూర్తి చేసుకుంటూ ఉండాలి. పని భారం ఉందని మొత్తానికి చేయకపోతే ఆ తర్వాత ఏ పని చేయలేకుండా ఉంటారు.