
Plastic Bottle: ఎండాకాలం వచ్చేసింది. ఎండ ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దాహం తీర్చుకునేందుకు ప్లాస్టిక్ బాటిల్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ బాటిల్ తో అనారోగ్య సమస్యలు రావడం సహజమే. అందుకే వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
ప్లాస్టిక్ బాటిల్ తో సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే మైక్రో ప్లాస్టిక్ తో అనారోగ్యాలు దరిచేరతాయి. దీంతో అందులో నీరు తాగడం సురక్షితం కాదు. కానీ చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంల ప్లాస్టిక్ బాటిళ్లు కొనుగోలు చేసి తాగుతుంటారు. దీని వల్ల కాలేయం దెబ్బతినడం జరుగుతుంది. ఇవి గుర్తుంచుకుని ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించుకోవడం మానుకోవాలి.

ప్లాస్టిక్ బాటిళ్లు ఎండలో ఉంచడం వల్ల డయాక్సిన్ వంటి విష పదార్థాలు విడుదల అవుతాయి. ఆ నీరు మన ఆరోగ్యానికి మంచిది కాదు. రొమ్ము క్యాన్సర్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇందులోని నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. మగవారు అయితే ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం మానుకోవాలి. లేదంటే వీర్య కణాల సంఖ్య తగ్గి సంతానం కలగకుండా చేస్తుందని చెబుతారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిల్స్ ను మళ్లీ వాడటం సురక్షితం కాదు. ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకొచ్చి వాటిని ఫ్రిజ్ లో ఉంచుకుని మరీ వాడతారు. ఇది కరెక్టు కాదు. ఇలా చేయడం అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే. ప్లాస్టిక్ కు బదులు గాజు లేదా మెటల్ గ్లాసులో పోసుకుని తాగడం మంచిది. దీని వల్ల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే మనకే లాభం.