
Jagan London : ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎంత ఒత్తిడి ఉంటుంది. ఓవైపు పాలన.. మరోవైపు పార్టీని చూసుకోవాలి. అసమ్మతిని కాచుకోవాలి. వీటన్నింటిని ఎప్పటికప్పుడు నిఘా వేగులతో కలిసి పర్యవేక్షించి బుజ్జగించాలి.. హెచ్చరించాలి.. లేదంటే సస్పెన్షన్ వేధించి తప్పించాలి. ఇన్ని టాస్కులతో ఎప్పుడూ బిజిబిజీగా ఉండే సీఎం జగన్ ఇప్పుడు వీటన్నింటిని వదిలేసి లండన్ వెళ్లిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి తన హడావిడి షెడ్యూల్‌కు చాలా విరామం తీసుకొని లండన్ టూర్ ప్లాన్ చేశాడు. ఏప్రిల్ 21న జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి విమానంలో లండన్ వెళ్లనున్నారు. లండన్‌లో విద్యను అభ్యసిస్తున్న తమ కుమార్తెతో వేసవి సెలవులు గడపాలని దంపతులు ప్లాన్ చేసుకున్నారు.
అయితే, ఏపీ సీఎంవో మాత్రం ఇప్పటికీ ఇంకా జగన్ షెడ్యూల్‌ను ధృవీకరించలేదు. ముఖ్యమంత్రి ముందస్తు అపాయింట్‌మెంట్‌లను పరిశీలిస్తోంది. కీలకమైన సమావేశాలు ఏవైనా ఉంటే జగన్ షెడ్యూల్ ఒకటి రెండు రోజులకు వాయిదా పడే అవకాశం ఉంది.
2019 నుంచి సీఎం జగన్, ఆయన భార్య భారతి లండన్‌లో ఉన్న తమ కుమార్తె వద్దకు వెళ్లడం ఆనవాయితీగా మారింది. అంతకుముందు 2022లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కోసం జగన్ దావోస్‌కు విమానంలో బయలుదేరారు. అయితే విమానం నేరుగా లండన్‌లో ల్యాండ్ అయింది. ఇది జగన్ ప్రత్యర్థుల నుండి విమర్శలకు కారణమైంది. రాజకీయ సంచలనాన్ని సృష్టించింది. దావోస్‌కు బదులుగా జగన్ లండన్‌కు వెళ్లడంపై ప్రశ్నలు తలెత్తాయి. ఫ్యామిలీ కోసం జగన్ దావోస్ పేరు చెప్పి వేరే దేశం వెళ్లాడన్న విమర్శలు వచ్చాయి.
ఇప్పటి వరకు జగన్ లండన్ పర్యటన రహస్యంగానే ఉంది. తెలియని కారణాలతో వైసీపీ పూర్తిగా దీనిపై పెదవి విప్పడం లేదు.. తన వ్యక్తిగత పర్యటనల కోసం జగన్ అధికారిక టూర్లుగా వాడుకుంటున్నారని.. విలువైన ప్రజలు, పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. అందుకే ఈసారి వ్యక్తిగతంగానే సెలవు తీసుకొని పర్సనల్ గా వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు.