Coffee: పరిగడుపున టీ, కాఫీ తాగుతున్నారా? అయితే డేంజర్లో పడినట్లే..

ఉదయం పరిగడుపున టీ తాగడం వల్ల మనిషిలో ఉత్తేజాన్ని ఇస్తుంది. కానీ ఇదే సమయంలో ఖాళీ కడుపులో వేడి వేడి టీ వెళ్లడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.

Written By: Chai Muchhata, Updated On : September 11, 2023 5:32 pm

Coffee

Follow us on

Coffee: ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగడం అలవాటు. కొంత మంది బెడ్ పై నుంచి దిగకముందే ‘బెడ్ కాఫీ ’ పేరుతో సేవిస్తూ ఉంటారు. ఇలా తాగడం వల్ల రోజంతా మైండ్ ఫ్రెష్ అవుతుందని భావిస్తుంటారు. అంతేకాకుండా టీలో ఉండే కెటిన్ అనే పదార్థం మనిషిలో ఉత్తేజాన్ని ఇస్తుందని అనుకుంటారు. కానీ పరిగడుపున ఇలా టీ లేదా కాఫీ తాగడం వల్ల అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి ఆహారం సేవించకుండా టీ తీసుకోవడం డేంజర్లో పడినట్లేనని అంటున్నారు. అదెలాగో ఒకసారి పరిశీలిద్దాం..

ఉదయం పరిగడుపున టీ తాగడం వల్ల మనిషిలో ఉత్తేజాన్ని ఇస్తుంది. కానీ ఇదే సమయంలో ఖాళీ కడుపులో వేడి వేడి టీ వెళ్లడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో ఉండే చక్కర నిల్వలు తగ్గిపోతాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు కప్పుల కొద్దీ ఇలా టీ తాగడం వల్ల స్కెలిటల్ ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. క్రమంగా తీవ్ర అనారోగ్యాల పాలవుతారు.

నిద్రలేచిన వెంటనే టీ తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో రోజంతా ఏం తిన్నా కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది క్రమంగా జరిగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా కడుపు ఉబ్బరంగా ఉండడం వల్ల మలబద్ధకం ఏర్పడే ఛాన్స్ ఉంది. దీంతో వికారం ఏర్పడుతుంది. టీ ఎక్కువ తాగేవారిలో చంచలతత్వం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరి మనసు ఒక్కచోట కుదురుగా ఉండదు.

ఇక టీ నిరంతరం పరిగడుపున టీ తాగడం వల్ల గుండె సమస్యలకు కూడా దారి తీయొచ్చు. అయితే తప్పనిసరిగా టీ తాగాలనుకున్న వారు..టీ తాగకుండా ఉండలేం అనేవారు.. వీటిలో బిస్కెట్లు లేదా బ్రెడ్ వేసుకొని తాగితే సమస్యను తగ్గించవచ్చు. అంతేకాకుండా టీ తాగే ముందు ఏవైనా పండ్లు తీసుకోవడం వల్ల టీ ప్రభావం శరీరంపై పడకుండా ఉంటుంది. అందువల్ల టీ తాగడంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.