Deposit: ప్రస్తుత కాలంలో Moneyనే జీవితం నడుస్తుంది. ఏ అవసరం తీరాలన్నా.. ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా.. డబ్బు తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు ద్రవ్యాన్ని చేతుల ద్వారా ఇచ్చి పుచ్చుకునేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ మయం కావడంతో ఆన్లైన్లోనే మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. డబ్బు పెద్ద మొత్తంలో ఇతరులకు పంపించాలన్నా.. ఖాతాలో డిపాజిట్ చేయాలన్నా.. బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి మొబైల్ ద్వారా కొన్ని లక్షల వరకు నగదును బదిలీ చేస్తున్నారు. అయితే ఈ బదిలీకి లేదా డిపాజిట్ కు పరిమితి ఉందన్న విషయం తెలుసుకోవాలి. ఒకవేళ పరిమితి దాటితే Income Tax కార్యాలయం నుంచి నోటీసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సేవింగ్స్ ఖాతాలో ఏమాత్రం పరిమితి మించినా ఐటీ అధికారులకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఇంతకీ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో ఎంతవరకు పరిమితి ఉందంటే..?
ప్రస్తుతం Onlineలోనే మనీ పేమెంట్ చేయడంతో ఒక్కోసారి ఎంతవరకు Financial Transactions చేస్తున్నామో గుర్తుంచుకునే వీలుండదు. అంతేకాకుండా కొందరు స్నేహితుల కోసం బ్యాంక్ అకౌంట్ లో లక్షల కొద్ది వేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సేవింగ్ బ్యాంక్ లో స్థాయికి మించి నగదు జమ అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
మిగతా బ్యాంకు ఖాతాలకంటే సేవింగ్ ఖాతాల విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల వరకు నగదును జమ చేసుకోవచ్చు. అలాగే Income Tax చట్టం ప్రకారం సెక్షన్ 269 ST ప్రకారం రోజుకు రూ. 2 లక్షల లావాదేవీలు చేయవచ్చు. అలాగే రూ 50,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయాల్సివస్తే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. లేదా పాన్ కార్డు వివరాలను అందించాలి. పాన్ కార్డు లేకపోయినా ఫామ్ 16 లేదా 61 సమర్పించాలి.
ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ .10 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపినట్లయితే ఆ తర్వాత బ్యాంకు అధికారుల కు సమాచారం ఇవ్వాలి. ఆ మొత్తాన్ని ఎందుకు డిపాజిట్ చేస్తున్నామో వారికి లిఖితపూర్వకంగా పేర్కొనాలి. మరోవైపు ఐటీ అధికారులు నోటీసులు అందిస్తే వారికి కచ్చితంగా దీనిపై సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇవ్వకుండా పరిమితికి మించి నగదు లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ పై అధికారుల పర్యవేక్షణ ఉంటుంది.
అందువల్ల నగదు ట్రాన్సాక్షన్ చేసే సమయంలో అవసరం ఉన్నంతవరకు మాత్రమే చేయాలి. ఇతరుల కోసం బ్యాంక్ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయడం వల్ల బ్యాంక్ అధికారులతో పాటు ఐటీ అధికారుల కు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో లేదా కొన్ని పరిస్థితుల్లో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయాల్సివస్తే అందుకు కారణం వివరించాలి. ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా ఈ పరిమితి వర్తిస్తుందని ఆదాయపు పన్ను చట్టం తెలుపుతుంది.