https://oktelugu.com/

Sandalwood : ఎర్ర చందనం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఎర్ర చందనం కు చాలా డిమాండ్ ఉంటుంది. ఇక దీని ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంతకీ దీనికి ఇంత డిమాండ్ ఎందుకు ఉంటుంది?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 12, 2025 / 12:01 AM IST

    Sandalwood

    Follow us on

    Sandalwood : ఎర్ర చందనం కు చాలా డిమాండ్ ఉంటుంది. ఇక దీని ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంతకీ దీనికి ఇంత డిమాండ్ ఎందుకు ఉంటుంది? దీనిని ఏ విధంగా ఉపయోగిస్తారు? అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. యాంటీ బాక్టీరియా, యాంటి ఇన్ ఫ్టమేటరీ వంటి లక్షణాలు ఎర్ర చందనం లో పుష్కలంగా ఉంటాయి. ఎర్ర చందనం తో విలాసవంతమైన ఫర్నిచర్ తయారుచేయవచ్చు. అంతేనా ఇంకా ఖరీదైన బొమ్మలు, సంగీత వాయిద్యాలు తయారుచేస్తారు. ఎర్ర చందనాన్ని ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు అని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

    చర్మ సమస్యలకు ఎర్ర చందనం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కడుపులో మంట, అధిక దాహం సమస్యలను నివారిస్తుంది. దీర్ఘకాలిక జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. వైద్యులు సూచనతో ఎర్ర చందనం వాడడం వలన మధుమేహం నయం అవుతుంది కూడా. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడంలో సహాయం చేస్తుంది. గ్యాస్, ఆసిడిటి, నొప్పిని తగ్గించడం లో సహాయపడుతుంది. ఇంకా కంటి వ్యాధులను నయం చేస్తుంది. క్యాన్సర్ తో పోరాడుతుంది.

    ఎర్ర చందనం లో యాంటిబయాటిక్ వంటి లక్షణాలు కలిగి ఉండడం వలన పరన్నాజీవి సంక్రమనను నిరోధిoచవచ్చు. పాము కాటుకు, తేళ్లు కుట్టిన ఈ ఎర్ర చందనాన్ని లేపనంగా వాడతారని నిపుణులు అంటున్నారు. ఇది అల్సర్, రక్త స్రావం కాకుండా సహాయపడుతుంది. వెంట్రుకల ఆరోగ్యానికి, పెరుగుదలకు సహాయపడుతుంది. శరీరానికి మంచి కూలింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాల చర్మ సమస్యలను నయం చేయడంలో ఎర్ర చందనం ఉపయోగపడుతుంది. ఇది వాపును తగ్గిoచడంలో సహాయంచేస్తుంది.

    ఇకపోతే ఎర్ర చందనంలో పలు రకాల ఖనిజాలు కూడా ఉన్నాయి. ఎర్రచందనంలో కాపర్, యురేనియం, సోడియం, కాడ్మియం, జింక్ వంటి ఖనిజాలను కలిగి ఉంటాయి. గాయాలను నయం చేయడానికి, రక్త గడ్డకట్టడానికి, థైరాయిడ్ పనితీరుకు, మీ శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, ఇంకా నరాల, కణాల, ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగపడుతుంది ఈ ఎర్రచందనం.

    ఎర్రచందనాన్ని ఆయుర్వేద వైద్యంలో ఎన్నో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఒక అమూల్యమైన ఔషధం కూడా. దీనిని ‘రక్తచందనం’ అని కూడా పిలుస్తారు. అయితే ఈ చెక్క నుంచి తీసిన పొడిని వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. మంటలకు, కొన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఎర్రచందనం బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది చర్మ సంక్రమణలను నివారించడంలో కూడా తోడ్పడుతుంది. ఎర్రచందనం తల చుండ్రును తగ్గించి, జుట్టును బలంగా చేయడంలో కూడా సహాయం చేస్తుంది. వయసుతో వచ్చే మచ్చలు, మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తాయి.