Winter season: అమ్మాయిలకు అందాన్నిచ్చే వాటిలో జుట్టు(Hair) చాలా ముఖ్యమైనది. కురులు అందంగా ఉంటేనే మహిళలు(Womens) అంత కంటే ఎక్కువ అందంగా(Beauty) కనిపిస్తారు. అయితే చలికాలంలో తీవ్రంగా జుట్టు అనేది రాలుతుంది. దీనికి తోడు కాలుష్యం, వ్యక్తిగత సమస్యలు(Personal issues), ఆందోళన వల్ల ఈ సమస్య ఇంకా పెరిగిపోతుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలని కొందరు ఎన్నో నియమాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్(Products) కూడా వాడుతుంటారు. అయిన కూడా జుట్టు రాలిపోయే సమస్య మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతుంది. ఇంతకు ముందు జనరేషన్‌లో ఒక్కోరి జుట్టు పొడవుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఎవరి జుట్టు చూస్తున్న కూడా చిన్నగానే ఉంటుంది. దీనికి ముఖ్య కారణం రసాయనాలు ఉండే ప్రొడక్ట్స్ వాడటమే అని నిపుణులు చెబుతున్నారు. వీటిని వాడటం వల్ల జుట్టు అధికంగా రాలిపోతుంది. అయితే ఈ శీతాకాలంలో జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కొబ్బరి నూనె మసాజ్
కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని కొవ్వు ఆమ్లాలు జుట్టును హైడ్రేట్‌గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నూనెను తలకు రాసి మసాజ్ చేయడం రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోకుండా పెరుగుతుంది. రోజూ ఒక 5 నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా డైలీ చేస్తే జుట్టు బలంగా రాలిపోకుండా పెరుగుతుంది. అయితే కేవలం కొబ్బరి నూనె అనే కాకుండా ఆలివ్ లేదా ఆముదం తలకు రాసి అయిన మసాజ్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలోవెరా జెల్
కలబంద జుట్టు పెరుగుదలకు బాగా సాయపడుతుంది. తలకు దీన్ని అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో జుట్టు ఎక్కువగా పొడి బారుతుంది. అదే కలబంద అప్లై చేస్తే ఈ సమస్య లేకుండా జుట్టు బలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మెంతి గింజలు
మెంతి గింజలలో ప్రోటీన్లు, ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా ఉంచడంతో పాటు చుండ్రును కూడా తగ్గిస్తాయి. వీటిని రాత్రి నానబెట్టి ఇందులో కరివేపాకు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది.
ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసం స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వారానికి ఒకసారి ఈ ఉల్లి రసాన్ని తలకు అప్లై చేయడం జుట్టు రాలిపోకుండా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లి లోని సల్ఫర్ కంటెంట్ జుట్టు పెరుగుదలకు బాగా సాయపడుతుంది.
వేడి నీటితో స్నానం వద్దు
తలకు బాగా వేడి నీటితో స్నానం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. వేడి నీరుకి జుట్టు బాగా దెబ్బతింటుంది. కాబట్టి చల్లని లేదా గోరువెచ్చని నీటితోనే తలకు స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.