https://oktelugu.com/

Skipping : జస్ట్ స్కిప్పింగ్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? బాప్ రే బాప్ రోజు చేయాల్సిందే అయితే..

ప్రతిసారి వ్యాయామం చేయాలంటే జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు జిమ్ కు వెళ్లకుండా కూడా ఇంట్లోనే మంచి వ్యాయామాలు చేయవచ్చు. వ్యాయామం కాకుండా మీకు తాడు ఆట తెలుసు కదా

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 3, 2025 / 07:00 AM IST
    Skipping

    Skipping

    Follow us on

    Skipping : ప్రతిసారి వ్యాయామం చేయాలంటే జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు జిమ్ కు వెళ్లకుండా కూడా ఇంట్లోనే మంచి వ్యాయామాలు చేయవచ్చు. వ్యాయామం కాకుండా మీకు తాడు ఆట తెలుసు కదా. అదేనండి స్కిప్పింగ్. దీని ద్వారా కూడా శరీరానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. చాలా మంది సినీ తారలు కూడా ఇదే పాటిస్తారు. రోజూ 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు.

    డైలీ స్కిప్పింగ్ వల్ల ప్రయోజనాలు:
    బరువు తగ్గడం – ఒక గంట పాటు స్కిప్పింగ్ చేయడం వల్ల మీరు 1,600 కేలరీలు వరకు బర్న్ చేయవచ్చు. కేవలం 10 నిమిషాల స్కిప్పింగ్ చేస్తే ఎనిమిది నిమిషాల్లో ఒక మైలు పరిగెత్తినట్టు అంటున్నారు నిపుణులు.

    పూర్తి శరీర వ్యాయామం: జంపింగ్ రోప్ అనేది పూర్తి శరీర వ్యాయామం. దాని సహాయంతో మీరు మీ శక్తిని పెంచుకోవచ్చు. అంతేకాదు పూర్తి దృష్టి, సమన్వయానికి చాలా సహాయపడుతుంది. అదనపు శరీర కొవ్వును తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం తాడు జంపింగ్. బాడీ టోనింగ్ కూడా జరుగుతుంది.

    ఎముకలు దృఢంగా మారతాయి – తాడు దూకడం శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. శరీరం నుంచి విషపూరిత మూలకాలను తొలగించడానికి, ప్రతిరోజూ 20 నిమిషాలు తాడును దూకాలి. దీనితో మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు.

    కార్డియోకి మంచి ఎంపిక- కార్డియో కోసం, జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతారు చాలా మంది. అయితే ఈ స్కిప్పింగ్ వల్ల ఇంట్లో కార్డియో సెషన్‌ను పూర్తి చేయవచ్చు. అంటే ఈ ట్రైడ్మిల్ పై పరుగెత్తడం కాకుండా జస్ట్ స్కిప్పింగ్ తో ఇది సాధ్యం అన్నమాట. దీని కోసం మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అథ్లెట్లు కార్డియో కోసం ఈ స్కిప్పింగ్ నే చేస్తారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

    చర్మం మెరుగుపడుతుంది – స్కిప్పింగ్ వల్ల ఇతర అధిక తీవ్రత గల వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరిగుతుంది. ఈ విధంగా మీరు శరీరం నుంచి మలినాలను బయటకు పంపవచ్చు. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. మెరుస్తుంది.

    కండరాలు దృఢంగా మారతాయి – రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల ఎముకలు అలాగే కండరాలు బలపడతాయి. ఈ సమయంలో రెండు చేతులు, కాళ్ళకు మంచి వ్యాయామం అవుతుంది. ఇది భుజాలు, చేతులు, కాళ్ళ కండరాల స్థాయిని బలపరుస్తుంది.

    గుండె జబ్బులకు దూరంగా ఉంటుంది – జంపింగ్ సమయంలో గుండె రక్తాన్ని వేగంగా పంపుతుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ఈ విధంగా మీరు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు.

    ఒత్తిడి తగ్గుతుంది: తాడు దూకడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ విధంగా మీరు రోజంతా మంచి అనుభూతి చెందుతారు.