Tears : మానవ శరీరంలో ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి. వీటిలో కొన్ని ఉపయోగకరమైనవి కాగా.. మరికొన్ని వ్యర్థాలుగా మారిపోతూ ఉంటాయి. కాలిగోటి నుంచి మెదడు వరకు వాటి పనితీరు దీనికదే అన్నట్టుగా ఉంటుంది. అయితే శరీరంలోని అన్ని భాగాల గురించి చాలామందికి తెలియదు. కానీ ప్రతి క్రియలో ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకునేది కన్నీళ్ల గురించి. ఉల్లిపాయ తరిగినప్పుడు.. ఏదైనా బాధ కలిగినప్పుడు.. సంతోషం ఎక్కువ అయినప్పుడు వస్తూ ఉంటాయి. అయితే ఈ రకమైన కన్నీళ్లు అన్ని ఒకటేనా? వీటిలో రకాలు ఉన్నాయా? అసలు కన్నీళ్లు ఎన్ని రకాలు? కన్నీళ్లలో కూడా రకాలు ఉంటాయా? అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
మనిషి కంటి నుంచి వచ్చే కన్నీళ్లు చూడగానే ఎదుటివారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. కానీ కన్నీళ్లు ఎందుకు వస్తాయి అనేది శాస్త్రీయంగా ఎవరు ఆలోచించలేదు. మానవ శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ కారణంగా కంట్లో బ్యాక్టీరియా లేదా ఇతర మిమ్ములు పెరగకుండా కన్నీళ్లు కాపాడుతూ ఉంటాయి. ఇవి కార్బనికా, అకర్బనికా సమ్మేళనాలు, సోడియం, పొటాషియం అంటివి ఉంటాయి. వీటివల్ల కన్నీళ్లు ఉప్పుగా మారుతూ ఉంటాయి. కన్నీళ్లు రావడం వల్ల కళ్ళు ఎప్పుడు ఫ్రెష్ గా మారుతూ ఉంటాయి. అంతేకాకుండా కళ్ళు పొడిబారకుండా తేమని కలిగి ఉంటాయి. కళ్ళలో దుమ్ము, ఇతర బ్యాక్టీరియా లేకుండా కన్నీళ్లు కాపాడుతూ ఉంటాయి.
Also Read : కన్నీళ్లు కూడా ఇన్ని రకాలు ఉన్నాయా.. శాస్త్రవేతలు ఎలా వర్గీకరించారంటే ?
అయితే ఏ సమయంలోనైనా కన్నీళ్లు ఒకేరకంగా ఉంటాయి కదా? మరి వీటిలో డిఫరెంట్ ఎందుకని కొందరికి సందేహం వస్తుంది. కానీ కన్నీళ్ళలో కూడా రకాలు ఉన్నాయని విషయాన్ని తెలుసుకోవాలి. మనుషులు ఒక్కో సమయంలో ఒక్కోరకంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఫీలింగ్ బట్టి కన్నీళ్ల రకాలు చెప్పవచ్చు. వీటిలో ప్రధానంగా ఏమంటే..
ఏదైనా బాధ కలిగినప్పుడు.. దుఃఖం వచ్చినప్పుడు వచ్చే కన్నీళ్లను భావోద్వేగా కన్నీళ్లు అని అంటారు. ఇవి శారీరక నొప్పి లేదా విపరీతమైన ఆనందం కారణంగా ప్రేరేపించబడతాయి. ఈ కన్నీళ్ల ద్వారా హృదయ స్పందన రేటు పెరగడంతోపాటు శ్వాస రేటు కూడా తగ్గి అవకాశం ఉంటుంది. ఇవి ఒక పరిమాణంలో ఉత్పత్తి అవుతాయి. అయితే భావోద్వేగా కన్నీళ్లు మనం అవసరం లేదనుకుంటే ఆపుకోవచ్చు.
బేసిల్ కన్నీళ్లు కూడా మరో రకం. ఈ కన్నీళ్లు కళ్ళలో ఏదైనా దుమ్ము లేదా బ్యాక్టీరియా పడ్డప్పుడు వస్తుంటాయి. ఇవి రావడం వల్ల ఆరోగ్యకరమే అని అనుకోవాలి. ఎందుకంటే కంట్లోని దుమ్మును తొలగించడానికి ఈ కన్నీళ్లు వెంటనే వస్తాయి. అలాగే ఎక్కువగా మొబైల్ చూసినా లేదా సైకిల్ నడుపుతున్నప్పుడు దానికి గురైన కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అయితే ఈ కన్నీళ్లను ఆపుకోవడం సాధ్యం కాదు. ఇవి ఎంత అవసరమో అంతే వస్తూ ఉంటాయి.
రిఫ్లెక్స్ కన్నీళ్లు మూడో రకం. ఈ కన్నీళ్లు ఒత్తిడి ఎక్కువగా ఏర్పడినప్పుడు వస్తాయి. అలాగే చికాకు వల్ల కూడా ఇవి ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా ఉల్లిపాయ తరిగినప్పుడు లేదా రసాయనకు సంబంధించిన ఫోన్ వెలువడినప్పుడు… ఇవి బయటపడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎక్కువగా దగ్గు వచ్చినప్పుడు లేదా.. ఆవలింపు వచ్చినప్పుడు ఈ కన్నీళ్లు వస్తూ ఉంటాయి. బేసిల్ కన్నీళ్ల కంటే ఇవి ఎక్కువ పరిమాణంలో వస్తాయి. వీటి ప్రధాన ఉద్దేశం కంటికి ఎలాంటి ఆపద లేదా ఏడు జరగకుండా కాపాడడం.