WhatsApp Users: సోషల్ మీడియా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. ఏ మూలకు ఏ విషయం జరిగినా క్షణాల్లోనే తెలిసిపోతోంది. గతంలో ఏదైనా జరిగితే ప్రపంచానికి తెలిసేది కాదు. ఇప్పుడు కాలం మారింది. సాంకేతికత పెరుగుతోంది. ఫలితంగా సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతోంది. క్షణాల్లో మనకు సమాచారం కళ్ల ముందు కదలాడుతోంది. అంతటి వేగవంతమైన వ్యవస్థ రూపుదాల్చింది. దీంతో ప్రపంచంలో ఏ మూలకు ఏ వింత జరిగినా వెంటనే మనకు కనబడుతోంది. దానిపై మన అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నాం. మంచి విషయాలైతే బాగుందని చెడు విషయాలైతే చీ అని మన నిర్ణయం తెలియజేస్తున్నాం. అంతటి వేగవంతమైన వ్యవస్థతో పనులు చకచకా సాగుతున్నాయి.

సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రా గ్రామ్, ట్విట్టర్ వంటివి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో ప్రతి వారు వాడేది మాత్రం వాట్సాప్. తెల్లవారింది మొదలు రాత్రి పడుకునే వరకు సందేశాల మోత మోగాల్సిందే. ఫోన్ మొత్తం మెసేజ్ లతో నిండిపోవాల్సిందే. అంతలా దాన్ని వాడుతున్నాం. దీంతో అందులో కొత్తదనం కోసం వ్యవస్థాపకులు నిరంతరం శ్రమిస్తున్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు పాకులాడుతున్నారు. కొత్త కొత్త యాప్ లు, ప్రోగ్రామ్ లు డిజైన్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.
ఇదే కోవలో వాట్సాప్ మరోమారు వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఫొటోలు పంపుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా లేటెస్ట్ ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది. దీంతో ఒరిజినల్ క్లారిటీతో ఫొటోలు ఇతరుకు పంపుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం వాట్సాప్ లో ఫొటోలు కంప్రెషన్ కు గురై బ్లర్ గా మారుతున్నాయి. ఇక మీదట ఫొటోలు పంపుకునే ముందు క్వాలిటీ మార్చుకునేందుకు వీలు కల్పిస్తోంది.

ఇమేజ్ ప్రివ్యూలో సెక్షన్ ను జోడించనుంది. దీంతో యూజర్లకు మంచి క్వాలిటీ ఫొటో పంపేందుకు మార్గం సుగమం చేయనుంది. దీంతో వాట్సాప్ రోజురోజుకు వినియోగదారులకు చేరువవుతోంది. పలు కొత్తతరహా మార్పులు చేస్తూ సేవలను అందించేందుకు మొగ్గు చూపుతోంది. అందుకే ప్రతి ఒక్కరు వాట్సాప్ తోనే పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇంకా భవిష్యత్ లో మరిన్ని సేవలు అందుబాటులో తేవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. వాట్సాప్ తోనే తమ పనులు చేసుకునేందకు యూజర్లు కూడా రెడీగా ఉంటున్నారు.