https://oktelugu.com/

Anjeer juice: అత్తి పండ్ల రసం తాగండి.. సర్వరోగాలను నివారించుకోండి

ఆరోగ్యానికి అంజీర్ చాలా మంచిది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని అత్తి పండ్లు అని కూడా అంటారు. సాధారణంగా ఇవి అత్తి పండ్లు, ఎండినవి కూడా ఇందులో ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 16, 2024 7:18 pm
    Anjeer juice

    Anjeer juice

    Follow us on

    Anjeer juice: ఆరోగ్యానికి అంజీర్ చాలా మంచిది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని అత్తి పండ్లు అని కూడా అంటారు. సాధారణంగా ఇవి అత్తి పండ్లు, ఎండినవి కూడా ఇందులో ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఈ అంజీర్ పండు మార్కెట్లో దొరుకుతుంది. ఈ పండు జ్యూస్‌ని డైలీ తాగడం వల్ల సర్వ రోగాల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. డైలీ ఒక్కసారైనా ఈ పండ్ల జ్యూస్ తాగితే ఊబకాయం తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. వీటితో పాటు మలబద్దకం, పొట్ట సమస్యలు, జీర్ణ సమస్యలు అన్నింటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు. ఈ అత్తి పండ్లలో ఎక్కువగా ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి. ఇవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

     

    తాజా అత్తి పండ్లు లేదా ఎండిన అత్తి పండ్లతో అయిన జ్యూస్ చేసి తాగవచ్చు. ఎండిన అత్తి పండ్లు అయితే రాత్రంతా నానబెట్టిన తర్వాత జ్యూస్ చేసుకోవాలి. డైలీ ఈ జ్యూస్ తాగడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు అంజీర్‌ పండును తిన్న లేకపోయిన జ్యూస్ తాగిన నిద్ర బాగా పడుతుంది. అలాగే తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. చాలా మంది ఈరోజుల్లో మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు రోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల సమస్య తగ్గుతుంది. దీర్ఘకాలికంగా ఈ సమస్యను తగ్గించగలిగే శక్తి అత్తి పండ్లకు ఉంది. వీటితో పాటు కీడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారికి కూడా ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ యూరోలిథియాటిక్ రాళ్ల సమస్యలను తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.

     

    శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచడంలో అత్తి పండ్లు బాగా ఉపయోగపడతాయి. అంజీర్ రసంలో ఫినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలిగించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగే గొంతు నొప్పి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. ఈ అత్తి పండ్ల జ్యూస్ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రోజూ ఈ పండ్లను తిన్నా లేదా తాగిన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే అల్జీమర్స్ వంటి వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఈ అత్తి పండ్లు బాగా సాయపడతాయి. కాబట్టి వీటిని డైలీ డైట్‌లో యాడ్ చేసుకోవడం ఉత్తమం.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.