https://oktelugu.com/

Gautham Adani: నేరం రుజువైతే గౌతమ్ అదానీకి 20 ఏళ్లు జైలు శిక్ష తప్పదా?

అదానీతో పాటు అతని మేనల్లుడు సాగర్‌తో సహా మరో 7గురిపై కేసు నమోదు చేసి, ఇప్పటికే అరెస్టు వారెంటీ కూడా జారీ చేశారు. అదానీ ఈ మోస పూరిత చర్యకు పాల్పడినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తెలిపింది. అయితే నిజంగానే గౌతమ్ అదానీ నేరం చేసినట్లు రుజువైతే.. ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? జరిమానా ఏమైనా విధించే అవకాశం ఉందా? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2024 / 03:16 AM IST

    Gautham Adani

    Follow us on

    Gautham Adani: భారత పారిశ్రామిక దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్‌ కోసం 265 బిలియన్ డాలర్లు అనగా దాదాపుగా రూ.2200 కోట్లు లంచంగా అదానీ అమెరికా ఇన్వెస్టర్లకు ఇచ్చినట్లు న్యూయార్క్‌లో కేసు నమోదు చేశారు. అమెరికా ఇన్వెస్టర్లు ప్రభుత్వ అధికారులను మోసం చేసి పెద్ద మొత్తంలో లంచం ఇచ్చారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆరోపణలు చేసింది. అదానీతో పాటు అతని మేనల్లుడు సాగర్‌తో సహా మరో 7గురిపై కేసు నమోదు చేసి, ఇప్పటికే అరెస్టు వారెంటీ కూడా జారీ చేశారు. అదానీ ఈ మోస పూరిత చర్యకు పాల్పడినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తెలిపింది. అయితే నిజంగానే గౌతమ్ అదానీ నేరం చేసినట్లు రుజువైతే.. ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? జరిమానా ఏమైనా విధించే అవకాశం ఉందా? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌లో గౌతమ్ అదానీ ఇన్వెస్టర్లకు లంచం ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నట్లు అక్కడి న్యాయవాదులు అంటున్నారు. దీనికి సంబంధించిన డిటేల్ స్పెడ్ షీట్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఫొటోగ్రాఫ్స్ వంటి ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజం అని తేలితే.. అక్కడ రూల్స్ ప్రకారం గౌతమ్ అదానీ తప్పకుండా శిక్ష పడుతుందని అంటున్నారు. ఈ నేరం అదానీ చేశాడని రుజువైతే దాదాపుగా 20 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు 2 మిలియన్ల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఈ జరిమానా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం అంతా ప్రెసిడింగ్ జడ్జి పైనే ఆధారపడి ఉంటుందని అమెరికా వర్గాల సమాచారం. ఇదే కానీ జరిగితే అదానీ జైలుకు వెళ్లడం పక్కా.

    దేశ వ్యాప్తంగా ఈ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అయితే వీటిపై గౌతమ్ అదానీ కూడా స్పందించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా తెలిపారు. నిజం తప్పకుండా గెలుస్తుందని, తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అయితే గౌతమ్ అదానీపై పలుమార్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో హిండెన్‌బర్గ్, బొగ్గు విషయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడు కూడా గౌతమ్ అదానీ షేర్లు ఒక్క రోజులోనే రూ. 2.24 లక్షల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని క్షణాల్లోనే ఇన్ని కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గత ప్రభుత్వం వైసీపీ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.