Amla: ఉసిరి రసంతో మధుమేహానికి చెక్.. సరికొత్త పద్ధతి ఇదీ

ఉసిరి జ్యూస్‌ను తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. మరి మధుమేహులు ఈ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 21, 2024 8:21 pm

Amla Juice Benefits

Follow us on

Amla: ఆరోగ్యానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. దీనిని డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. రోజూ ఉసిరి కాయను తినడం వల్ల ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఉసిరిలో ఎన్నో ఔషధ పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే సీజనల్‌గా ఈ ఉసిరి ఎక్కువగా దొరుకుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అయితే మార్కెట్లో తాజా ఉసిరికాయలు లభిస్తాయి. కొందరు ఉసిరితో పచ్చళ్లు కూడా చేసి పెట్టుకుంటారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని భావిస్తారు. అయితే ఉసిరి కాయను డైరెక్ట్‌గా తినడమే కాకుండా వీటితో జ్యూస్ చేసి కూడా తాగుతుంటారు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. మరి మధుమేహులు ఈ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

ఈ రోజుల్లో చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. దీని బారిన పడితే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కొన్ని సార్లు మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. దీని బారిన పడిన వారు ముఖ్యంగా ఆహార విషయంలో అయితే చాలా అనిగి మనిగి ఉండాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. స్వీట్లు, కొన్ని పండ్లు, తీపి పదార్థాల జోలికి అసలు వీరు పోకూడదు. అయితే మధుమేహం ఉన్నవారు ఉసిరి రసాన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పూట ఉసిరి రసాన్ని తాగితే మధుమేహులకు మంచి ఫలితం ఉంటుందట. అయితే ఈ ఉసిరి జ్యూస్‌లో పసుపు, తేనె కలిపి తాగితే ఇంకా ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కేవలం మధుమేహులకు మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఉసిరి జ్యూస్ సాయపడుతుంది.

 

డైలీ ఉసిరి రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. అయితే కేవలం వీటికే కాకుండా జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా ఉసిరి బాగా పనిచేస్తుంది. ఈ ఉసిరి ప్యాక్‌ను జుట్టుకు అప్లై చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది. ఉసిరి కాయలను ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. ఈ పౌడర్‌ను తలకు పట్టిస్తే జుట్టు నిగనిగ లాడుతుంది. అలాగే ఉసరి కాయలను తిన్నా లేదా జ్యూస్ తాగిన చర్మం కూడా మెరుగుపడుతుంది. ఉసిరి రసంలో ఎక్కువగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి సీజనల్‌గా దొరికనప్పుడు అయిన కూడా ఉసిరిని డైలీ తినడం ఆరోగ్యానికి మంచిది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.