Homeట్రెండింగ్ న్యూస్Mukesh Ambani: రూ.630 కోట్లతో దుబాయ్ తీరంలో ఖరీదైన విల్లా కొన్న అంబానీ.. ఎవరికోసమో...

Mukesh Ambani: రూ.630 కోట్లతో దుబాయ్ తీరంలో ఖరీదైన విల్లా కొన్న అంబానీ.. ఎవరికోసమో తెలుసా?

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖాష్ అంబానీ త్వరలో తన రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకే తన వారసులకు వ్యాపారాలను పంచుతున్నారు. ఇద్దరు కొడుకులు, కూతురుకు వ్యాపారాలను అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆకాష్, ఈషా, అనంత్ లకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యాపారాన్ని కేటాయిస్తున్నారు. జియోను ఆకాష్ కు, ఈ కామర్స్ రీటైల్ ను ఈషాకు, అనంత్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని వారసులకు విస్తరించే క్రమంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన విల్లా కొనుగోలు చేసి వారికి సౌకర్యవంతంగా చేస్తున్నారు.

Mukesh Ambani
Mukesh Ambani

దుబాయ్ లోని సముద్ర తీరంలో విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. పామ్ జువేరాలో రూ.630 కోట్లు వెచ్చించి ఓ ఖరీదైన విల్లా కొనుగోలు చేశారు. ఇది అనంత్ అంబానీకి బహుమానంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల నిర్వహణకు దుబాయ్ వెళ్లినప్పుడు ఆయనకు సౌకర్యవంతంగా ఉంటుందని ఈ విల్లా కనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇంగ్లండ్ లో ఆకాష్ కు కూడా ఓ విల్లా కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక దుబాయ్ లో కొన్న విల్లాలో పది బెడ్ రూంలు ఉన్నట్లు చెబుతున్నారు. అత్యంత ఖరీదైన భవనంగా కనిపిస్తోంది. వీరి భవనం పక్కనే షారుఖ్ ఖాన్ కు చెందిన విల్లా ఉండటం తెలిసిందే.

Also Read: JP Nadda My Home Jupally: కేసీఆర్ పై కోపం.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలవబోతున్న టీవీ9 చైర్మన్ ‘జూపల్లి’.. అసలు కథేంటి?

యూఏఈ, సౌదీ అరేబియా దేశాల్లో తరచూ పర్యటనలు చేయడానికి అనువుగా ఈ విల్లా కొనుగోలు చేశారని చెబుతున్నారు. పెట్రో వ్యాపారానికి అనంత్ ను బాస్ ను చేయడంతో ఆయన రాకపోకలకు సదుపాయాలు కల్పించేందుకు ఈ విల్లా కొనుగోలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అంబానీ తన ఆస్తులను విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగానే యూకేలో రూ.600 కోట్లతో అధునాతన వసతులున్న అందమైన భవనాన్ని కొనుగోలు చేశారు. అటు న్యూయార్క్ లో సైతం కూతురు కోసం కొన్నారు. ఇలా దేశాల్లో తమకు ఆస్తులను సంపాదిస్తున్నారు.

Mukesh Ambani
villa in Dubai

దుబాయ్ లో కొన్న విల్లాకు ఇంకా సదుపాయాలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ పరంగా ఇంకా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమాలను ఎంపీ పరిమళ్ నత్వానీ చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ వ్యాపారాలు విస్తరించే క్రమంలో అన్ని చోట్ల విల్లాలు కొనుగోలు చేసి తమ కుటుంబ సభ్యులు వెళ్లినప్పుడు సేద తీరేందుకు అనువుగా మలుచుకుంటున్నారు. ఎన్ని విల్లాలు కొనుగోలు చేసినా అంబానీ కుటుంబం ముంబయిలోని అధికార నివాసం అంటాలియానే ప్రముఖంగా ఉండబోతోందని తెలుస్తోంది.

Also Read:Cyber Fraud: ఒక్క క్లిక్‌తో రూ.21 లక్షలు ఖాళీ.. సైబర్‌ మోసాలకు వాట్సాప్‌ వేదిక!

 

బాలీవుడ్ అగ్ర హీరోల ఒక రోజు సంపాదన || Bollywood Top Heroes Daily Earnings || Oktelugu Entertainment

 

Kethika Sharma Funny Comments On Vaishnav Tej || Ranga Ranga Vaibhavanga || Oktelugu Entertainment

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version