Somavati Amavasya: సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అనే సంగతి తెలిసిందే. అయితే సోమవారం రోజున, అమవాస్య రోజున శివుడికి పూజలు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సోమావతి అమవాస్య రోజున శివుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్లకు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ప్రతి సంవత్సరం కేవలం రెండుసార్లు మాత్రమే ఈ సోమావతి అమవాస్య వస్తుందని చెప్పవచ్చు.
సోమావతి అమవాస్య రోజున రావిచెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది. జాతకంలో కాలసర్ప దోషాలు ఉంటే సోమావతి అమవాస్య రోజున పూజలు చేయడం మంచిది. పెళ్లి కాని వాళ్లతో పాటు పెళ్లైన వాళ్లు కూడా రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సోమావతి అమవాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రధానం చేస్తే మంచిది.
జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆ దోషాలను తొలగించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సోమావతి అమవాస్య రోజున ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయని చెప్పవచ్చు. సోమావతి అమవాస్య రోజున పూజలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం చంద్రుడు గాయాలతో ఉన్న సమయంలో పరమేశ్వరుడు అమవాస్య తిథి ఉన్న సోమవారం రోజున తనకు అభిషేకం చేయాలని సూచించాడు.
అలా చేస్తే చంద్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడని శివుడు చెప్పాడు. సోముడు అంటే చంద్రుడు అని అర్థం కాగా శివుడు చంద్రుడిని ధరిస్తాడు కాబట్టి శివుడిని సోమేశ్వరుడు అని కూడా పిలవడం జరుగుతుంది. సోమావతి అమవాస్య రోజున పూజలు చేయడం సాధ్యం కాకపోతే శివ పంచాక్షరి జపంతో అయినా గడిపితే మంచిది.