Google: వెనుకటికి విఠలాచార్య సినిమాలు చూస్తున్నప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే వాళ్ళం. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లోనే ఆయన వెండితెరపై అద్భుతాలు సృష్టించారు. అలాంటి అద్భుతాలు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? అలాంటి వాటిని చూసినప్పుడు మన మనసు ఎలాంటి అనుభూతి పొందుతుంది? ఇవే కాదు ఇలాంటి ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం గూగుల్. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తెలుసుకునే వెసలు బాటు దగ్గర నుంచి పంపించే మెయిల్ వరకు ప్రతిదీ గూగుల్ లోనే. ఒక రకంగా చెప్పాలంటే గూగులమ్మ మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. యూట్యూబ్, జీ మెయిల్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్.. ఇలా ఇందు గలదు అందులేదు.. ఎందెందు చూసినా అందందుల్లో ఉందన్నట్టు.. గూగుల్ ఇప్పుడు సమస్త రంగాలకు విస్తరించింది. గూగుల్ కనిపెట్టిన యూట్యూబ్లో రోజుకు ఒక బిలియన్ అవర్స్ వాచింగ్ నమోదవుతుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా బిలియన్ కిలోమీటర్ల నావిగేషన్ రికార్డ్ అవుతోంది. గూగుల్ డ్రైవ్ ను ఎనిమిది వందల మిలియన్ల యాక్టివ్ యూజర్లు వాడుతున్నారు. ఇక ఆండ్రాయిడ్ ను అయితే దాదాపు 1000 మిలియన్ యాక్టివ్ యూజర్లు వినియోగిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు గూగుల్ సేవలను వినియోగించుకుంటున్నాయి.
వాస్తవానికి గూగుల్ సెర్చ్ ఐడియాను లారీ ఫేజ్, సెర్జీ బ్రౌన్ మిలియన్ డాలర్లకు అమ్మేద్దాం అనుకున్నారు. ఆ ఆలోచనను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వయంగా గూగుల్ సెర్చ్ ఇంజన్ ను ప్రారంభించారు. సాంకేతిక ప్రపంచాన్ని సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అంటే తెలియని అక్షరాస్యుడు లేదంటే అతిశయోక్తి కాదు. ఏదో ఒక సందర్భంలో గూగుల్ అందిస్తున్న వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తూనే ఉంటారు. ఇక గూగుల్ నిర్వహించే సమాచారం 86 డేరా బైట్లలో నిక్షిప్తమై ఉంటుంది. కోసం రెండు బిలియన్ లైన్ల కోడ్ అవసరం ఉంటుంది. ప్రతిసారి గూగుల్ అందించే ఏదైనా సర్వీస్ సెర్చ్ చేసినప్పుడు అది 86 టెరాబైట్ల ఫైల్స్ లో శోధిస్తుంది. అంతేకాకుండా మనం కొత్తది ఏదైనా సమాచారం అందించినప్పుడు అది సంబంధిత ఫైల్స్ లో నిక్షిప్తం అవుతుంది. 2006లో గూగుల్ యూట్యూబ్ ను 1.65 బిలియన్ డాలర్లకు కొనేసింది. ప్రస్తుతం యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రఖ్యాత వెబ్సైట్ గా నిలిచింది. ఇది ఇంతలా పేరు సంపాదించేందుకు గూగుల్ ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలను జోడించడమే కారణమని టెక్ నిపుణులు చెబుతుంటారు. ప్రతి ఒక్కరూ తమ ఛానల్ నుంచి ఎన్నో వీడియోలు అప్లోడ్ చేసేందుకు యూట్యూబ్ అవకాశం కల్పిస్తుంది. ఒక నిమిషానికి యూట్యూబ్లో 300 గంటల నుడిపికి సమానమైన వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఇంకా ముందుకు వెళితే ఒక సంవత్సర కాలంలో 1507 మిలియన్ గంటలకు సమానమైన వీడియోల లోడ్ జరుగుతోంది.
ఇక గూగుల్ అసలు పేరు “బ్యాక్ రబ్”. లారీ ఫేజ్, సేర్జీ బ్రౌన్ ఇద్దరూ గ్రాడ్యుయేట్లు ఒక గ్యారేజీలో స్థాపించిన ఈ స్టార్టప్ పేరు ” బ్యాక్ రబ్”. కానీ ఇది గూగుల్ గా మారి ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతోంది. గూగుల్ సెర్చ్ ఆల్గారిథం కేవలం కీవర్డ్, మ్యాచింగ్ స్ట్రింగ్ ల పైనే ఆధారపడదు. బ్యాక్ లింక్స్ పాయింటింగ్ ఆధారంగా చేసుకుని వెబ్సైట్లకు సెర్చ్ ర్యాంకింగ్ ఇస్తుంది. ఇక జిమెయిల్ గూగుల్ ఉత్పత్తిలో ముఖ్యమైనది. జిమెయిల్ ప్రపంచంలో 50 కి పైగా భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇక జిమెయిల్ తెలుగు భాషలో కూడా ఉండడం మన భాషకు దక్కిన గౌరవం. మెయిల్ తెరవగానే రకరకాల ఐడి నుంచి అనవసర మెయిల్స్ వస్తూ ఉంటాయి. వీటిని ఒకసారి తొలగించినా మళ్ళీ మళ్ళీ వచ్చి విసిగిస్తుంటాయి. ఈ బాధలు తప్పించేందుకు జిమెయిల్ రెండు సరికొత్త ఆప్షన్లు ప్రవేశపెట్టింది.” బ్లాక్, అన్ సబ్ స్క్రైబ్” ఆప్షన్లు ఉన్నాయి. అయితే వాటిని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి తీసుకురావడం గూగుల్ కు మాత్రమే చెల్లింది. మామూలుగా గూగుల్. కో. ఇన్ లో కానీ, గూగుల్. కామ్ లో సెర్చ్ చేసినప్పుడు అవసరమైన ఫలితం వచ్చేందుకు చాలా కష్టపడుతుంటాం. అవసరమైన ఫలితాల్లో మనకు కావాల్సింది వెతుక్కునే ఓపిక అందరికీ ఉండదు. అలాంటప్పుడు ఐయామ్ ఫీలింగ్ లక్కీ అనేదానిపై క్లిక్ చేస్తే ఇంతకుముందు సెర్చ్ ఫలితాల్లో ఏది ముందుంటే నేరుగా అక్కడికి తీసుకెళ్తుంది. ఇది సెర్చ్ రిజల్ట్ పేజీని బైపాస్ చేస్తుంది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. 2010 తర్వాత గూగుల్ అధికారికంగా గూగుల్ ప్లస్ రిలీజ్ చేసింది. ఇది ఒక సామాజిక మాధ్యమం. ఫేస్బుక్ ప్రజల్లో భారీగా వెళ్ళి పోవడం వల్ల, సరైన యూజర్ ఇంటర్ ఫేజ్ లేకపోవడం వంటి కారణాలవల్ల గూగుల్ ప్లస్ అనుకున్నంత విజయవంతం కాలేదు. గూగుల్ ప్లస్ ను సంక్షిప్తంగా జి ప్లస్ ఐటం పిలుస్తారు. సరేనా కమ్యూనిటీలో యాడ్ చేయడానికి, ఈవెంట్స్ కు ఆహ్వానించేందుకు ఇందులో ఆప్షన్లు ఉంటాయి. ఏదైనా గూగుల్ సెర్చ్ లో వెతికినప్పుడు ఒక్కోసారి గూగుల్ ప్లస్ రిజల్ట్ సైతం వస్తుండడాన్ని గమనించవచ్చు. ఈమధ్య గూగుల్ సెర్చ్ ఇంజన్ ను, గూగుల్ ప్లస్ పేజీతో ఇంటర్ లింక్ చేసి ఉండడమే ఇందుకు కారణం.
ఇక గూగుల్ కనిపెట్టిన మరొక అద్భుతం క్రోమ్. గూగుల్ క్రోమ్ అనేది ఒక వెబ్ బ్రౌజర్. మొదటిసారి బీటా వెర్షన్ 2008లో విడుదల చేసింది. స్థిరమైన తుది వెర్షన్ డిసెంబర్ 11 2008లో విడుదలైంది. ట్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫ్రేమ్ లేదా వెబ్ బ్రౌజర్ క్రోమ్ నుంచి దీని పేరు స్వీకరించారు. ప్రపంచంలోనే అత్యధిక మంది నెటిజెన్లు ఉపయోగిస్తున్న బ్రౌజర్ గా క్రోమ్ రికార్డు సృష్టించింది. క్రోమ్ జావా స్క్రిప్ట్ వర్చువల్ మిషన్ ను కూడా ఉపయోగిస్తుంది. క్రోమ్ 4.1 తో ప్రారంభమై గూగుల్ ట్రాన్స్లేట్ ను ఉపయోగించే ఒక అంతర్ నిర్మిత అనువాద సూచిని కూడా జోడించారు. ప్రస్తుతం అనువాదం 52 భాషలకు పైగా అందుబాటులో ఉంది. ఇక్కడ కేవలం అనువాదం స్వీకరించడం మాత్రమే కాకుండా సజెస్ట్ ఎడిట్ అనే ఆప్షన్ ద్వారా మనం సైతం అనువాదానికి తోడ్పడవచ్చు. గూగుల్ మ్యాప్స్ మహా నగరాలతో మొదలుపెట్టి టైర్_2, టైర్_3 నగరాలను దాటి ప్రస్తుతం చిన్న పట్టణాలకు సైతం గూగుల్ మ్యాప్ విస్తరించింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా సంవత్సరంలో మీరు ఎప్పుడు, ఎక్కడ ఉన్నారో కూడా తెలుస్తుంది. దీనికోసం మ్యాప్స్ యాప్ పై కనిపించే మూడు అడ్డ గీతల ఐకాన్ క్లిక్ చేస్తే యువర్ టైం లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. 360 డిగ్రీల్లో ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలను గూగుల్ మ్యాప్స్ లో చూడొచ్చు. ప్రకృతి వైపరీత్యాల హెచ్చరికల ఫీచర్ సైతం గూగుల్ తన అప్లికేషన్లో పొందుపరిచింది. ఇప్పుడైతే గూగుల్ డూడుల్ వేలాదిగా కనిపిస్తున్నాయి.. దీని వెనుక పెద్ద చరిత్ర ఉంది.1998లో నెవడా పండుగ సందర్భంగా ఒక వ్యక్తి కాలిపోతున్న ఫోటోను ప్రతిబింబిస్తూ బర్నింగ్ ఐకాన్ లోగోతో మొదటి డూడుల్ ప్రవేశపెట్టారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ స్ట్రీట్, గూగుల్ పిక్సెల్స్, గూగుల్ డ్రైవ్ వంటి వాటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మనిషి జీవితాన్ని మరింత సుఖవంతం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే గూగుల్ లేకుండా మనిషి మనుగడ సాధించలేడు. అందుకే మొదట చెప్పినట్టు గూగుల్ మాత్రమే గూగుల్ సంస్థకు పోటీ. లేరెవరూ సాటి.