
3 Zodiac : మన జ్యోతిష్యంలో శని దేవుడు అంటే అందరికి భయమే. కానీ శని కూడా మనకు మంచి లాభాలు ఇస్తాడని చాలా మందికి తెలియదు. శని సంచారం వల్ల మూడు రాశుల వారికి ఎంతో మేలు కలుగుతోంది. ఇక వారి దశ బ్రహ్మాండంగా మారనుంది. వారు అనుకున్నది చేస్తారు. డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది.వారి మాటకు ఎదురుండదు. మరో ఇరవై నాలుగు గంటల్లో వారికి రాజయోగం సిద్ధిస్తోంది.

వృషభ రాశి
రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. శని ఏడో ఇంటిపై చూస్తున్నాడు. దీని కారణంగా అన్నింట్లో లాభాలు అందుకోనున్నారు శుక్రుడు లగ్న ఇంట్లో సంచరిస్తున్నాడు. దీంతో వీరి దాంపత్య జీవితం బాగుంటుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. నవపంచమ రాజయోగం సందర్భంగా వీరికి వ్యాపారంలో బాగా కలిసొస్తుంది. పెద్దపెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అన్ని విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. కుటుంబపరంగా మంచి అవకాశాలు వస్తాయి.

సింహ రాశి
శని వీరికి నాలుగో ఇంట ఉండబోతున్నాడు. దీంతో వీరి జీవితం సంతోషమయంగా ఉండబోతోంది.
వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకోనున్నారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. దీంతో వీరికి అనుకున్న పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సంఘంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.

కుంభ రాశి
ఈ రాశి వారికి అన్నింట్లో శుభాలు కలుగుతాయి. శని దేవుడి ప్రభావంతో వీరికి పట్టిందల్లా బంగారమే. మరో వైపు శుక్రుడి సంచారం వల్ల వీరికి రాజయోగం కలగనుంది. వ్యాపారాలు పెరుగుతాయి. ఆదాయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారులకు ఆదాయం బాగా వచ్చేందుకు అనుకూలమైన మార్గాలు ఏర్పడుతున్నాయి. ఇలా ఈ మూడు రాశుల వారికి శని ప్రభావంతో ఎంతో మేలు కలుగుతోందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.