Shubha Muhuraths 2022: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ మంచి పని చేయాలన్నా ముహూర్తం చూసుకోవాల్సిందే. కొందరి జాతకాల ప్రకారం చూస్తే వారికి కుదిరే ముహూర్తంలోనే పనులు చేసుకునేందుకు సిద్ధపడుతుంటారు. కొందరు ముహూర్తం కోసం తమ పనులు వాయిదా వేసుకోవడం తెలిసిందే. కరోనా కారణంగా రెండేళ్లుగా పెళ్లిళ్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో కొందరు కొద్ది మందితో చేసుకున్నా మరికొందరు మాత్రం వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ముహూర్తాలు చూసుకుని పెళ్లిళ్లు, పేరంటాలు చేస్తున్నారు. కానీ జూన్ నెలలో నాలుగు రోజులే ముహూర్తాలు ఉండటంతో అందరు తొందరపడుతూ తమ కార్యాలు ముగించుకోవాలని చూస్తున్నారు.

కరోనా కారణంగా రెండేళ్లు మంచిరోజులు ఉన్నా భయంతో ఎవరు కూడా ముందుకు రాలేదు. దీంతోనే చాలా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు సిద్ధపడుతున్నారు. జూన్ లో 18,19,22,23 తేదీల్లోనే ముహూర్తాలు ఉండటంతో ఇదే సమయంలో తమ వేడుకలు నిర్వహించుకోవాలని తాపత్రయపడుతున్నారు. పెళ్లి, గృహప్రవేశాలు, కేశఖండనం తదితర కార్యాలు జరుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ పోజులపై నెటిజన్ల నెగెటివ్ కామెంట్లు వైరల్
ఇక ఈ ముహూర్తాలు పోయాయంటే ఆగస్టులోనే మంచి రోజులు ఉన్నాయి. జులై నెలలో ఆషాఢ మాసం కావడంతో అప్పుడు శుభకార్యాలు జరుపునేందుకు ముహూర్తాలు ఉండటంతో ఇప్పుడే తమ పనులు పూర్తి చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ నాలుగు రోజులు షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, దుకాణాలు సందడిగా మారాయి. ఇక పురోహితులు, వంటల వాళ్లు కూడా బిజీగా అయిపోయారు. మిగిలింది నాలుగు రోజులే కావడంతో అందరికి డిమాండ్ ఏర్పడింది.

దీంతో ముహూర్తాలు బాగుండటంతో అందరు కూడా తమ పనులు త్వరగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లోనే కొన్ని వందల పెళ్లిళ్లు, శుభకార్యాలు జరగనున్నాయి. దీనికి గాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ కార్యం జరుపుకునే నిమిత్తం హడావిడిగా పనులు చక్కబెడుతున్నారు. వేల జంటలు ఒక్కటయ్యేందుకు ఈ నాలుగు రోజులే కీలకంగా మారడంతో అన్ని చోట్ల సందడి నెలకొంది. తమ కార్యం జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టులో వచ్చే ముహూర్తాలకు ఇంకా సమయం ఉండటంతో ఇప్పుడే తమ తతంగం పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు.
Also Read:Pawan Kalyan : కోట్లు పెట్టిన ఆ నిర్మాతను పవన్ కళ్యాణ్ ముంచుతాడా? తేల్చుతాడా? కారణం అదే?
[…] […]