Children : ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల పెంపకం చాలా కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉండడంతో పిల్లలను పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లలు ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంట్లో మన కళ్ళ ఎదుట ఉన్న మైమరచి ఉండడంతో అనుకొని సంఘటనల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైనా వస్తువు తో ఆడుకుంటూ దానిని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకున్న క్రమంలో గొంతులోకి వెళ్తుంది. ఒక్కోసారి శ్వాస కష్టమై ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అయితే ఇలా గొంతులో ఇరుక్కునే సమయంలో ప్రాథమికంగా చికిత్స చేయాలని కొందరు నిపుణులు అంటున్నారు. అదేంటంటే?
Also Read : పిల్లలు ఎత్తు పెరగాలంటే ఆహారం పట్ల జాగ్రత్త మస్ట్
చిన్నపిల్లల గొంతులో ఏదైనా ఇరుక్కోగానే వెంటనే ఆందోళన పడుతూ ఉంటారు. అయితే ఇటువంటి సమయంలో వైద్యులను సంప్రదించడం మంచిది. కానీ అంతకంటే ముందు ప్రాథమికంగా చికిత్స కూడా చేసుకోవచ్చని అంటున్నారు. చిన్నపిల్లలు ఏదైనా నోట్లో పెట్టుకుని లోపలికి మింగినప్పుడు అది గొంతులో ఆగిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో వైద్యుల వద్దకు వెళ్లే ముందు చిన్నపిల్లలను మొత్తంగా తలకిందులుగా ఉంచాలి. అలా ఉంచిన తర్వాత కడుపుపై నాలుగు లేదా ఐదు సార్లు మెల్లిగా కొడుతూ ఉండాలి. ఇలా చేయడంవల్ల గొంతులో ఏది ఇరుక్కున్న బయటికి వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రాథమికంగా ఇలా చేయడం వల్ల శ్వాస ఆగిపోవడం అనేది ఉండదు. ఎక్కువ సమయం గొంతులో ఉన్న వస్తువును అలాగే ఉంచితే శ్వాస కష్టమైపోతుంది. అయితే ఇది గొంతులో ఉన్నంతవరకు మాత్రమే తిరిగి రావడానికి సాధ్యమవుతుంది. కడుపు లోపలికి వెళ్లినా.. లేదా ఊపిరితిత్తులోకి వెళ్లిన రావడం కష్టమే అవుతుంది. అంతేకాకుండా ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత కూడా గొంతులోని వస్తువు బయటకు రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లల వద్ద నోట్లోకి చొరబడే వస్తువులను ఎలాంటివి ఉంచకూడదు. ముఖ్యంగా గోళీలు వంటివి అసలే దగ్గరగా ఉంచకూడదు. ఎందుకంటే వీటిని చూడగానే చిన్నపిల్లలు నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంది. వారికి నోటి కంటే పెద్ద సైజు ఉండే బాల్ లేదా ఆట వస్తువులను ఉంచాలి. అలాగే ఇనుముకు సంబంధించిన చిన్న చిన్న వస్తువులను కూడా చిన్న పిల్లల వద్ద వదిలేయకూడదు. అంతేకాకుండా ఐదేళ్ల లోపు చిన్నారులను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. బయట ఆడుకునే సమయంలోనూ రాళ్లతో పాటు ఇతర వస్తువులను కూడా నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంది. ఇక స్కూలుకు వెళ్లే విద్యార్థులు సైతం స్లేట్ పెన్సిల్ వంటివి కూడా నోట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదు. కానీ ఎవరో ఒకరు వీరి చెంత ఉంటూ వారిని గమనిస్తూ ఉండాలి. లేకుంటే ఆదామరిచి ఉండడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది.
Also Read : పుట్టిన వెంటనే పిల్లలకు ఈ పరీక్షలు చేయించండి. మస్ట్