
India vs Australia 2nd Test: ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా రెండో టెస్టు కొనసాగుతోంది. భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా విలవిలలాడినా కంగారూలు కూడా అంతే స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా విజయం కోసం ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 263 పరుగులకే ఆలౌటైంది. వారు కూడా అదే విధంగా ఎదురు దాడి చేస్తున్నారు. దీంతో శనివారం టీమిండియా 200 స్కోరు దాటినా ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ నడ్డి విరిచాడు. స్పిన్నర్లు అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు తీయడం గమనార్హం.
అక్షర్ పటేల్ రూపంలో..
భారత్ విజయం కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇండియాను ఆదుకుంటున్నాడు. 252 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయిన ఇండియాను గట్టెక్కించడానికి అక్షర్ ఒంటి చేత్తో పోరాటం చేస్తున్నాడు. 80వ ఓవర్ లో భారత్ ఇంకా 11 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో టీమిండియాను అక్షర్ పటేల్ ఆదుకుంటాడా? లేక చేతులెత్తేసాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఇంకా 33 పరుగులు వెనుకబడి ఉంది.
టాప్ ఆర్డర్ విఫలమైనా..
రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, అశ్విన్ లు నిలకడగా ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది. కంగారూల కంటే 84 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో టీమిండియా ఆల్ రౌండర్లు అశ్విన్, అక్షర్ పటేల్ ఇద్దరు ఎనిమిదో వికెట్ కు 67 బంతుల్లో 40 పరుగులు జోడించారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు 35 పరుగులు రాబట్టారు. 60 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 170 చేరింది. 93 పరుగులు వెనుకబడి ఉండగా మెల్లగా జవాబు ఇచ్చేందుకు పోరాడుతోంది.

పరాజయం అంచుల నుంచి..
ప్రస్తుతం భారత్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఆసీస్ కు ధీటుగా పోరాడుతోంది. పరాజయం అంచుల నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతోంది. టాప్ ఆర్డర్ విఫలమైనా అక్షర్ పటేల్ అస్త్రంలా మారాడు. కంగారూలకే కంగారు పుట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఆసీస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఎనిమిదో బ్యాటర్ గా వచ్చిన పటేల్ ఆటతీరుతో అందరు ఫిదా అవుతున్నారు. ఆపద సమయంలో జట్టును ఆదుకునేందుకు ఆపద్భాంధవుడిలా మారిన అక్షర్ పటేల్ సాహసం అందరిలో ప్రశంసలు కురిపిస్తోంది. అక్షర్ పటేల్ 74 పరుగులు చేసి ఇండియాకు వెన్నెముకగా నిలవడం గమనార్హం.