Airtel Fiber Plans: ఇంటర్నెట్ యుగంలో భారత్ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుపుకుటోంది. మొన్నటి వరకు 4G హవాతో ఇంటర్నెట్ ఎంజాయ్ చేసిన వినియోగదారులకు ఇప్పుడు టెలికాం కంపెనీలు 5Gని అందుబాటులోకి తీసుకొస్తున్నాయ. తక్కువ ధరలో అత్యంత వేగమైన ఇంటర్నెట్ సదుపాయాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో Jio Fiberను లాంచ్ చేయనున్నట్లు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. దీనికి పోటీగా ఇప్పుడు Airtel Fiberను కూడా తీసుకొచ్చేందకు ప్లాన్ వేస్తున్నారు. ఎయిర్ టెల్ నుంచి ఇప్పటికే Xtreame వినియోగంలో ఉంది. అయితే జియోకు పోటీగా వితౌట్ కేబుల్ తో ఫైబర్ ను తీసుకురావాలని చూస్తున్నారు.
టెలికాం రంగంలో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అతి తక్కువ ధరకు అత్యధిక స్పీడ్ ఇంటర్నెట్ ను కల్పించాలని కంపెనీలు కొత్త కొత్ ఆవిష్కరణలు చేస్తున్నాయి. 4జీ నుంచి 5జీకి నెట్ వర్క్ మారుతున్న దశలో వినియోగదారులు సైతం 5జీకి అలవాటు పడిపోతున్నారు. ఈరోజుల్లో ప్రతీ పని ఇంటర్నెట్ తోనే ముడిపడి ఉంది. ఇంటర్నెట్ అవసరం లేనివారంటూ లేరు. ఈ నేపథ్యంలో కంపెనీలు సైతం స్పీడ్ ఇంటర్నెట్ ను తక్కువ ధరకు అందించాలని చూస్తున్నాయి.
Airtel నుంచి త్వరలో రాబోయే ఫైబర్ కేబుల్ రహితంగా ఉంటుంది. ఇంట్లో 5జీ నెట్ వర్క్ వచ్చే ప్లేసులో దీనిని అమర్చుకోవాలి. ప్రత్యేక డివైజ్ కలిగిన దీనికి ఒక సిమ్ కార్డు, పవర్ కేబుల్ ఉంటుంది. ఇంటర్నెట్ కు సంబంధించి టవర్ నుంచి కనెక్ట్ అవుతుంది. దీని ద్వారా మిగతా డివైజ్ లకు హాట్ స్పాట్ ద్వారా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. దీని ధరను రూ.6000గా నిర్ణయించినట్లు సమాచారం. నెలకు రూ.500 తో 100 ఎంబీ స్పీడ్ తో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటికే జియో ఫైబర్ ను అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ కంపెనీ ప్రకటించింది. అంతకంటే ముందే ఎయిర్ టెల్ ఫైబర్ ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్రతినిధులు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్లేస్టోర్ లో మాత్రం ఎయిర్ టెల్ ఫైబర్ కు సంబంధించిన యాప్ కనిపిస్తోంది. దీంతో అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.