https://oktelugu.com/

Airport: దేశంలో అందమైన విమానాశ్రయాలు ఏంటో మీకు తెలుసా?

విమాన ప్రయాణం సంగతి పక్కన పెడితే.. అందమైన విమానాశ్రయాలను చూడాలని అనుకుంటారు. దీంతో కొన్ని విమాన ప్రయాణాలు చేయాలని భావిస్తారు. అయితే మన ఇండియాలో ఎన్నో అందమైన విమానాశ్రయాలు ఉన్నాయి. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. మరి ఆ అందమైన విమానాశ్రయాలు ఏవో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2024 / 02:48 AM IST

    Airports

    Follow us on

    Airport: ప్రయాణాలు చేయడమంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా విమాన ప్రయాణాలు అంటే ఇంకా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే విమానం ఎక్కి ఆకాశం, భూమిపై అందాలను చూడాలంటే ఎంతో సుందరంగా అనిపిస్తుంది. అలాగే ఎక్కడికైనా తొందరగా వెళ్లవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుందని భావిస్తారు. ఇతర దేశాలు వెళ్లడం పక్కన పెడితే ఇండియాలోనే దూర ప్రాంతాలకు వెళ్లాలంటే కొందరు విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. విమాన ప్రయాణం సంగతి పక్కన పెడితే.. అందమైన విమానాశ్రయాలను చూడాలని అనుకుంటారు. దీంతో కొన్ని విమాన ప్రయాణాలు చేయాలని భావిస్తారు. అయితే మన ఇండియాలో ఎన్నో అందమైన విమానాశ్రయాలు ఉన్నాయి. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. మరి ఆ అందమైన విమానాశ్రయాలు ఏవో ఈ స్టోరీలో చూద్దాం.

    లెంగ్‌పుయ్ విమానాశ్రయం
    మిజోరంలో ఉన్న లెంగ్‌పుయ్ విమానాశ్రయం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అందానికే ఈ విమానాశ్రయం ప్రసిద్ధి చెందింది. ఈ విమానాశ్రయానికి సమీపంలో పెద్ద పర్వతాలు, పచ్చదనం అన్ని ఉంటాయి. ఇవి ఎంతో అందంగా ఉంటాయి.

    గగ్గల్ విమానాశ్రయం
    హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ఉన్న గగ్గల్ విమానాశ్రయం భారతదేశంలోని అందమైన విమానాశ్రయాలలో ఒకటి. ఈ విమానాశ్రయం ధర్మశాల నుంచి 14 కిలోమీటర్ల దూరంలో 2525 అడుగుల ఎత్తులో ఉంది. ఈ విమానాశ్రయం అందాలను చూస్తుంటే మిగతా ప్రదేశాలు అసలు గుర్తు కూడా రావు.

    వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం
    ఈ విమానాశ్రయం అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో ఉంది. ఈ విమానాశ్రయం చుట్టూ చాలా పచ్చదనం ఉంది. ఆ పచ్చదనాన్ని చూస్తే ఆహా ఏమి అందం అనాల్సిందే. ఈ విమానాశ్రయం చూస్తే స్వర్గంలా అనిపిస్తుంది.

    కుషోక్ బకులా రిన్‌పోచే విమానాశ్రయం
    లడఖ్‌లో ఉన్న ఈ విమానాశ్రయం ప్రపంచంలోని ఎత్తైన విమానాశ్రయాలలో ఒకటి. ఇది సుమారు 3256 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ విమానాశ్రయం నుంచి చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తే ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంటాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు కనిపిస్తాయి. వీటిని చూడటానికే కొందరు విమాన ప్రయాణం చేయడానికి వెళ్తుంటారు.

    దబోలిమ్ విమానాశ్రయం
    గోవాలో ఉన్న దబోలిమ్ విమానాశ్రయం సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ అందమైన ప్రదేశాలను చూడాలని చాలా మంది కోరుకుంటారు.

    అగతి విమానాశ్రయం
    లక్షద్వీప్‌లో ఉన్న ఈ విమానాశ్రయం సముద్రం మధ్యలో ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌లో దిగితే విమానం సముద్రంలో ల్యాండ్ అయినట్లు అనిపిస్తుంది. అంత అందంగా ఈ ప్రదేశం ఉంటుంది. ఈ అందమైన లొకేషన్‌ను ఆస్వాదించడానికే చాలా మంది ఈ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుంటారు. సాధారణంగా బీచ్‌లో ఉంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటిది బీచ్ మధ్యలో ల్యాండ్ అయ్యామంటే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది.