Homeలైఫ్ స్టైల్Air Cooler: న్యూ ఫీచర్స్ | ఏసీలకు ధీటుగా సరికొత్త ఫీచర్లతో ఎయిర్ కూలర్స్...

Air Cooler: న్యూ ఫీచర్స్ | ఏసీలకు ధీటుగా సరికొత్త ఫీచర్లతో ఎయిర్ కూలర్స్ …

Air Cooler: హైదరాబాద్ : సమ్మర్ లో ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు అందరూ ఎయిర్ కండిషన్లు, ఎయిర్ కూలర్లను ఆశ్రయిస్తుంటారు. ఏసీల విష యంలో రేటు ఎక్కువే కాకుండా విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగానే వస్తుంది. ముఖ్యంగా కరెంట్ ఆదా చేయడంలో కూలర్లు ప్రత్యామ్నాయం గా పనిచేస్తాయి. లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్ లోకి వచ్చే కూలర్‌లు సరికొత్త స్మార్ట్ ఫీచర్‌లు కలిగి ఉంటున్నాయి. ఈ ఫీచర్లు వినియోగదారు లకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి.

ఎయిర్ కూలర్లు సాధారణంగా తేమ ఉన్నపరిస్థితులలో పనికిరానివిగా పరిగణిస్తారు. వాస్తవానికి, అవి పరిసరాలను మరింత తేమగా మారుస్తాయి. ప్రస్తుతం మార్కెట్ లోకి వచ్చిన కూలర్‌లు వాతావరణానికి అనుగుణంగా తేమ స్థాయిని మెరుగ్గా నిర్వహించడానికి కూలింగ్ ప్యాడ్‌లపై నీటి ప్రవాహాన్ని సర్దుబాటు చేయడానికి వినియోగదారులను అనుమతించే ‘హ్యూమిడిటీ కంట్రోల్’ ఫీచర్‌తో వస్తున్నాయి.

Air Cooler
Air Cooler

ఆటో ఫిల్ ఎయిర్ : ఆధునిక సాంకేతికతతో వచ్చే మరో ముఖ్యమైన ఫీచర్. అంటే అర్ధరాత్రి వాటర్ ట్యాంక్ ఖాళీ అవుతుందని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే, వినియోగదారులు దీని కోసం కూలర్‌ కు వాటర్ పైపు ను అనుసంధానం చేస్తే , ఆటోమేటిక్ గా వాటర్ ట్యాంక్ ఫుల్ అవ్వగానే నీళ్లు బంద్ అవుతాయి.

ఆటో డ్రెయిన్ ఫంక్షన్: ఎయిర్ కూలర్ల నుంచి పాత నీళ్లు, లేదా మురికి నీటిని తీసివేయడం కాస్త ఇబ్బందిగా అనిపించే ప్రక్రియ. ఆటో డ్రెయిన్ ఫంక్షన్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇది కూలర్ నుంచి నీటిని ఆటోమేటిక్‌గా బయటకు పంపడానికి వీలుగా ఉంటుంది.

మస్కిటో నెట్ : ఎయిర్ కూలర్లలోపలికి దోమలు,కీటకాలు చేరకుండా ప్రత్యేకంగా ఈ ఫీచర్ ను ఏర్పాటు చేశారు. ఈ నెట్ వల్ల దోమలు,ఇతర కీటకాలు కూలర్‌లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

Also Read: Vijayasai Reddy: ప్రమోషనా.. డిమోషనా? వైసీపీలో విజయసాయి స్థానం ఏంటి?

ఇతర గృహోపకరణాల మాదిరిగానే, ఎయిర్ కూలర్లు స్మార్ట్ ఫీచర్ ను యాడ్ చేశారు. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా తమ కూలర్ ను నియంత్రించుకోవడానికి వీలు కల్పించేలా వైఫై కనెక్టివిటీతో కూలర్‌లు అందుబాటులో ఉన్నాయి. కూలర్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయడం, స్వింగ్ మోడ్‌ని మార్చడం వంటివి ఇందులో ఉన్నాయి.

అలెక్సా ,గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్ సపోర్ట్: ఆధునిక కూలర్‌లు అమెజాన్ అలెక్సా ,గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్‌లకు కూడా సపోర్ట్ తో వస్తున్నాయి. వినియోగదారులు తమ వాయిస్‌ని ఉపయోగించి దీన్ని నియంత్రించడానికి వీలవుతుంది .

పీఎం 2.5 ఫిల్టర్: కొన్ని కూలర్లు ఇంటర్నల్ పీఎం 2.5 ఫిల్టర్‌లతో వస్తున్నాయి. ఇవి ఎయిర్ ను మరింతగా ప్యూరిఫై చేస్తాయి. దీని వల్ల పరిసరాలు పరిశుభ్రంగా , దుమ్ము లేకుండా ఉంటాయి.

టచ్ బటన్ కంట్రోల్ : ఎయిర్ కూలర్లలో మరో ప్రధాన మార్పు టచ్ బటన్లను చేర్చడం. ఇది సాధారణంగా రిమోట్ కంట్రోల్‌తో వచ్చే కూలర్‌లలో కనిపిస్తుంది.

మోటార్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ :మోటర్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ అనేది ఎయిర్ కూలర్ మోటారు దెబ్బతినకుండా నిరోధించే సెక్యూరిటీ. ఈ ఫీచర్ విద్యుత్ హెచ్చు ,తగ్గుల సమయంలో మోటారు దెబ్బతినకుండా కాపాడడానికి వీలవుతుంది.

టెంపరేచర్ డిస్ప్లే : ప్రస్తుతం మార్కెట్ లోకి వచ్చిన కూలర్‌లు అందించే మరో కొత్త ఫీచర్ ఇది . దీనిద్వారా పరిసర ప్రాంతంలో ప్రస్తుత ఉష్ణోగ్రతను ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అదే టెంపరేచర్ డిస్ప్లే.

Also Read: Salaar Movie: సలార్ కోసం భారీ రిస్క్ తీసుకున్న KGF మేకర్స్.. తేడా అయితే చావు దెబ్బే!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version