
Sunrisers Hyderabad New Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20 సిరీస్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌పై ఇన్నాళ్లూ కొనసాగిన ఉత్కంఠకు యాజమాన్యం తెర దించింది. రాబోయే సీజన్‌కు జట్టు సారధిగా దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్‌క్రామ్‌ను ఎంపిక చేసింది. ఈమేరకు ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది.
స్టైలిష్ బ్యాట్స్‌మెన్..
దక్షిణాప్రికాకు చెందిన స్టైలిష్ బ్యాట్స్‌మెన్ మార్‌క్రామ్ 2014లో అండర్ – 19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్‌లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత ఆ దేశ జట్టుకు ఎంపికై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అన్ని ఫార్మట్లతో మంచి ప్రరద్శన కనబర్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రాంచైజీల దృష్టిలోనూ పడ్డాడు.
పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం..
2021 ఐపీఎల్‌లో మార్‌క్రామ్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్‌లో 29.20 సగటుతో 146 పరుగులను సాధించాడు. తర్వాత జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది. అంచనాకు తగినట్లుగా గత ఐపీఎల్‌లో 47.63 సగటుతో 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులు చేశాడు.
ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌పై ఆసక్తి..
సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఆ జరిగిన టోర్నీల్లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోతోంది. 2016లో టీం కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవరించాడు. ఏడేళ్లుగా లీగ్ దశలోనే పోరాటం ముగిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్ ఈసారైనా మళ్లీ టైటిల్ గెలవాలని తెలుగు క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. జట్టును విజయపథంలో నడిపించే నాయకుడు ఎవరా.. యాజమాన్యం ఎవరిని నియమిస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫస్ట్ ఆప్షన్ భువీ..
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ రేసులో మొదటి వరుసలో భువనేశ్వర్ కుమార్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. భువీకి గతంలో అనేక సందర్భాల్లో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. అందుకే మేనేజ్మెంట్ మొదటి ఫస్ట్ ఆప్షన్ భువీకి ఇస్తున్నట్లు సమాచారం. భువీతోపాటు రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్‌క్రమ్ వంటి ఆటగాళ్లు కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్లు అంచనా వేశారు. త్రిపాఠికి పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేకపోయినా, అగర్వాల్ గతంలో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.

మార్‌క్రామ్ మంచి ఆప్షన్..
కెప్టెన్సీ రేసులో ఐదారుగురు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్‌క్రామ్ మంచి ఆప్షన్ అని ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు భావిస్తున్నారు. మార్‌క్రామ్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. అంతే కాకుండా 2014లో దక్షిణాఫ్రికాకు అండర్–19 వరల్డ్‌కప్ అందించాడు. ఈ టోర్నీలో అద్భుతమైన కెప్టెన్సీతోపాటు విలువైన పరుగులు చేశాడు. ఆరు మ్యాచ్‌లలో 370 పరుగులు చేశాడు. ప్రారంభ టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు కూడా టైటిల్ అందించాడు. గాయపడిన ఫాఫ్ డుప్లెసిస్‌ను భర్తీ చేస్తూ మార్‌క్రామ్ గతంలో దక్షిణాఫ్రికా సీనియర్ జట్టుకు కూడా నాయకత్వం వహించాడు. గ్రేమ్ స్మిత్ ఓ సందర్భంలో.. మార్‌క్రామ్‌ను భవిష్యత్తు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా అభివర్ణించాడు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరఫున మార్‌క్రమ్ బ్యాట్‌తో మెరిశాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో సంచలన సెంచరీని కొట్టాడు. చాలా కాలంగా మార్‌క్రమ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. అవసరమైనప్పుడు బౌలింగ్ కూడా చేయగలడు. దీంతో జట్టు యాజమాన్యం సారధిగా మార్‌క్రామ్‌నే ఎంపిక చేసింది.