Adani Group Enter Telecom Spectrum: ఒకే రాష్ట్రానికి చెందిన దిగ్గజాలు. వ్యాపార రంగంలో ఆరితేరినవారు. ప్రపంచంలోనే కుబేరులుగా పేరు గాంచిన వారు. ఇద్దరు తమదైన శైలిలో వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఒకరిని మించి మరొకరు పోటీ పడుతూ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించుకుంటున్నారు. దీంతో వారికి ఎదురే లేకుండా పోయింది. వారే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ ఇప్పటికే పెట్రోలియం, రసాయనాలు, టెలికాం రంగాలను ఏలుతున్నారు. అందులో ఆయనకు పోటీ లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం గౌతమ్ అదానీ కూడా వ్యాపార రంగంలో విస్తరిస్తున్నారు. తనకు సైతం ఎదురే లేదని నిరూపిస్తూ ఇటీవల కుబేరుల్లో అంబానీనే దాట వేసిన సంగతి తెలిసిందే దీంతో ఇద్దరు దిగ్గజాలు ఒకే వ్యాపారం కోసం పోటీపడటం సంచలనం కలిగిస్తోంది.

ఇన్నాళ్లు వారి వ్యాపార లావాదేవీలు వేరువేరు. ఒకరి వ్యాపారానికి మరొకరు అడ్డు తగిలే ప్రయత్నాలు ఎక్కడా జరగలేదు. కానీ ఇప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. టెలికాం రంగంలో ముఖేష్ అంబానీ ఎంతో అనుభవం గడించి దిగ్గజ సంస్థగా ఎదిగిన క్రమంలో గౌతమ్ అదానీ గ్రూపు కూడా టెలికాం రంగంలో అడుగిడేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే జులై 26నుంచి జరిగే స్పెక్ర్టమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూపు దరఖాస్తు చేసుకుంది. దీంతో ముఖేష్, అదానీ గ్రూపులు రెండు వేలంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ లతో పాటు అదానీ గ్రూపు కూడా దరఖాస్తు చేసుకుంది.
Also Read: CM Jagan: ఈ జీవితానికి వైసీపీ నాదే.. జగన్ సంచలన నిర్ణయం
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇంతవరకు ఏ రంగంలో కూడా పోటీ పడలేదు. కానీ ఈసారి మాత్రం వీరిద్దరు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వేలంలో ఎవరు నెగ్గుతారో తెలియడం లేదు. కానీ మొత్తానికి వీరి మధ్య పోటీ మాత్రం అనివార్యమనే వాదనలు వస్తున్నాయి. ఇద్దరు కుబేరుల మధ్య పోటీ కావడంతో ఎవరికి వారే తమ బలం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖేష్ అంబానీ అయితే చేయని వ్యాపారం లేదు. అన్నింట్లోనూ ఆయన హస్తం ఉంది.

దీంతో కొత్తగా వచ్చిన అదానీ గ్రూపు అంబానీని తట్టుకుని పోటీలో నిలబడుతుందా? లేక ఆయనకే టెండర్ అప్పగిస్తుందా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఇద్దరు కుబేరుల మధ్య వ్యాపార పోటీ రసవత్తరంగా ఉంటుంది. పెట్టుబడుల రంగంలో ఎవరికి వారే పోటీ. ఈ మధ్య అంబానీని సంపాదనలో దాటేసిన అదానీ ఇందులో కూడా తన సత్తా చాటుతారా? లేదా? అనేది సందేహమే. కానీ టెలికాం రంగంలో నూతన మార్పులు తీసుకొచ్చేందుకు ఈ వేలం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.
వ్యాపార రంగంలో నూతన మార్పులు వస్తున్న తరుణంలో స్పెక్ర్టమ్ వేలం ద్వారా నెట్ వర్క్ మరింత వేగవంతం కానుంది. 5 జీ ద్వారా అత్యంత వేగమైన నెట్ వర్క్ ను అందజేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగానే వేలం నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో దిగ్గజ సంస్థలు అంబానీ, అదానీ గ్రూపులు దరఖాస్తులు చేయడంతో పోటీ రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read:MS Dhoni Kadaknath Chicks: ధోని పెంచే కడక్నాథ్ కోళ్ల కథేంటి.. ఎంతకు అమ్ముతున్నాడో తెలుసా?