Chanakya Niti Woman: ఆచార్య చాణక్యుడు నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో మనం చేయకూడన పనులేంటి? వాటితో మనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయనే దానిపై వివరించాడు. తన నీతి శాస్త్రంలో మానవుల ప్రవర్తన గురించి పలు రకాలుగా విశదీకరించాడు. జీవన క్రమంలో మనం చేసే తప్పులను ఎత్తి చూపాడు. మనం ఎలాంటి పనులు చేస్తే లాభం కలుగుతుంది? ఏ పనులు చేయడం వల్ల నస్టాలు వస్తాయనే దానిపై సూటిగా చెప్పాడు. మనిషి కష్టాలకు కారణాలను కూడా చూపాడు.

చాణక్యుడు చెప్పిన సత్యాలు ఇప్పటికి మనకు ఆచరణీయంగా ఉన్నాయి. మనిషి ఆనందకరమైన జీవితం గడపాలంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలనే విషయాలు వెల్లడించాడు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, నైతిక అంశాల్లో చాణక్యుడు చూపించిన మార్గం మనకు ఎంతో ఉపయుక్తం. తన నీతి శాస్త్రంలో ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎలాంటి మహిళలకు దూరంగా ఉండాలి? ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే జీవితం నందనవనంగా మారుతుందనే విషయాలపై ఆసక్తికరంగా వివరించాడు.
మనం పెళ్లి చేసుకునే మహిళ బద్దకస్తురాలై ఉండకూడదు. మహిళ బద్ధకస్తురాలైతే ఆ ఇల్లు చిందరవందరగా ఉంటుంది. పిల్లలకు కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. బద్ధకంగా ఉన్న మహిళలు ఏ పని చేయకుండా ఉంటారు. దీంతో జీవితంలో వారికి ఎలాంటి లక్ష్యాలు ఉండవు. ఎప్పుడు చూసినా ఏ పని చేయకుండా కూర్చుంటే ఇల్లు గడవటం కూడా కష్లమవుతుంది. అలాంటి వారితో స్నేహం చేసినా మిగతా వారు కూడా చెడిపోతారు. మహిళలకు బద్ధకం ఉంటే కష్టం. వారితో సంసారం చేయడం అంత సులభం కాదు.

అత్యాశ కలిగిన స్త్రీలను కూడా పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే వారి ఆశలు తీర్చుకోవడానికి వారు ఎంతకైనా తెగిస్తారు. తమ స్వార్థం కోసం ఎదుటి వారిని బలి చేస్తారు. తమ సుఖమే ప్రధానంగా ముందుకు సాగుతారు. దీంతో కట్టుకున్న వాడికి చుక్కలే. సంసారంలో ఎలాంటి అనురాగాలు ఉండవు. అత్యాశ కలిగిన వారు అబద్దాలు చెబుతారు. తమ కోరికలను తీర్చుకునేందుకు ఎందాకైనా వెళతారు. పిల్లలను సైతం పట్టించుకోరు. దీంతో భర్తకు ఇబ్బందులు తప్పవు. ఇలాంటి మహిళలను చేసుకుంటే మగవాడికి ఇక నరకయాతనే. అందుకే చాణక్యుడు చెప్పినట్లు మంచి నడవడిక గల వారిని చేసుకోవడమే ఉత్తమం.