Vastu Tips: మనలో కొంతమంది వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తే మరి కొందరు మాత్రం వాస్తును అస్సలు పట్టించుకోరు. వాస్తు నియమాలను పాటించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇంటి విషయంలో వాస్తు దోషాలు ఉంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లైన మహిళలు, పెళ్లికాని అమ్మాయిలు కొన్ని నియమాలను పాటించాలి.
పెళ్లికాని అమ్మాయిలు వాయువ్య దిశలో నిద్రిస్తే మంచిదని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల పెళ్లికాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పెళ్లైన అమ్మాయిలు మాత్రం పడమర దిక్కులో లేదా వాయువ్య దిశలో పడుకోకూడదు. ఒకవేళ మహిళలు అలా నిద్రిస్తే మాత్రం వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ అయితే ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం వాయువ్య దిశలో ఏవైనా లోపాలు ఉంటే అక్వేరియం లేదా ఫౌంటెన్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఆ సమస్యలను అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తరచూ అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలు వేధిస్తున్నా వాస్తు దోషాలు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇంటిలో వాస్తు దోషాలు ఉంటే సరి చేసుకుంటే మంచిది.
వాస్తు దోషాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్నిసార్లు ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం అయితే ఉంటుంది. అద్దె ఇంట్లో నివశించాలని భావించే వాళ్లు సైతం వాస్తు దోషాలు లేని ఇంటిని ఎంపిక చేసుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు.
[…] Zerodha: ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయవచ్చు. జీవితంలో దేన్నయినా సాధించవచ్చు అలాంటి ఆరోగ్యమే లేకపోతే ఇక వ్యర్థమే. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటారు. ఈ నేపథ్యంలో ఓ ఆన్ లైన్ సంస్థ తమ ఉద్యోగుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఉద్యోగులు ఫిట్ గా ఉండాలనే ఉద్దేశంతో వారిలో పోటీతత్వం తీసుకొచ్చింది. కరోనా కాలంలో ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులు కాస్త మందమయ్యారు. దీంతో ఆ సంస్థ సీఈవో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు నడుం బిగించారు. వారిని ఫిట్ గా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. […]