Homeలైఫ్ స్టైల్AC outdoor unit placement tips: ఏసీ అవుట్ డోర్ యూనిట్ ఎక్కడ ఉంచాలి.. ఎండలో...

AC outdoor unit placement tips: ఏసీ అవుట్ డోర్ యూనిట్ ఎక్కడ ఉంచాలి.. ఎండలో ఉంటే ఏమవుతుంది..

AC outdoor unit placement tips: ఎయిర్ కండిషనర్ (AC)వినియోగం ప్రస్తుతం వేసవి పరిస్థితుల్లో చాలా అవసరం. అయితే ఏసీని వినియోగించేటప్పుడు దీని పనితీరును మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. చాలా మందికి ’AC కూలింగ్ ’ తక్కువగా ఉండడం.. లేదా కరెంట్ బిల్లు ఎక్కువగా రావడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలకు అవుట్‌డోర్ యూనిట్ సరైన ప్రదేశంలో లేకపోవడమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అందుకే అవుట్‌డోర్ యూనిట్‌ను ఎక్కడ.. ఎలా అమర్చాలి..? అనే విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అసలు అవుట్ డోర్ యూనిట్ ఎలాంటి ప్రదేశంలో ఉంచాలి? ఇది ఎండలో ఉంటే ఏం జరుగుతుంది?

ప్రతీ ఎయిర్ కండీషనర్ కు అవుడ్ డోర్ యూనిట్ చాలా కీలకం. ఇది మెరుగైన పనితీరు ఉంటేనే ఇంట్లో ఉండే ఏసీ ఎలాంటి సమస్యలు లేకుండా సాగుతుంది. అవుట్‌డోర్ యూనిట్‌ను ఎప్పుడూ నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి. నేరుగా ఎండ పడే చోట పెడితే యూనిట్ వేడెక్కి.. కంప్రెసర్ ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీంతో కూలింగ్ సామర్థ్యం తగ్గడమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు గోడకు ఉత్తరం లేదా తూర్పు వైపు నీడ ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవడం మంచిది.

అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ గాలి సరిగా వెళ్లేలా ఖాళీ ఉండాలి. గోడలకు బాగా దగ్గరగా లేదా మూసివేసిన ప్రదేశంలో పెడితే వేడి గాలి బయటకు వెళ్లకుండా తిరిగి యూనిట్‌లోకి చేరుతుంది. దీనివల్ల AC పనితీరు దెబ్బతింటుంది. కనీసం 2 నుంచి 3 అడుగుల ఖాళీ ఉండేలా చూసుకోవాలి. అవుట్‌డోర్ యూనిట్‌ను ఎత్తులో (slightly elevated position) అమర్చడం మంచిది. నేలపై ఉంచితే దుమ్ము, మట్టి, నీరు చేరే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల యూనిట్ త్వరగా మురికిగా మారి పనితీరు తగ్గుతుంది. స్టాండ్ లేదా బ్రాకెట్‌పై అమర్చితే దీర్ఘకాలం సాఫీగా పనిచేస్తుంది. ఇండోర్ , అవుట్‌డోర్ రెండు యూనిట్ల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటే కూలింగ్ సామర్థ్యం తగ్గుతుంది. పైపింగ్ ఎక్కువైతే గ్యాస్ ప్రెజర్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దగ్గరగా అమర్చడం ఉత్తమం.

అవుట్‌డోర్ యూనిట్‌ను తరచూ శుభ్రం చేయడం కూడా అవసరం. దుమ్ము, చెత్త పేరుకుపోతే హీట్ ఎక్స్చేంజ్ సరిగా జరగదు. కనీసం కొన్ని నెలలకు ఒకసారి సర్వీస్ చేయిస్తే AC పనితీరు మెరుగ్గా ఉంటుంది, కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. నీడ, గాలి ప్రవాహం, సరైన ఎత్తు, తగిన దూరం, శుభ్రత ఇవన్నీ పాటిస్తే AC కూలింగ్ బాగుంటుంది. విద్యుత్ ఖర్చు కూడా నియంత్రణలో ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular