Aadhaar Card Update: మనకు ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటనే విషయం తెలిసిందే. యూఐడీఏఐ జారీ చేస్తున్న ఈ కార్డులను మన దేశంలోని పౌరులంతా పొందే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందే అవకాశంతో పాటు ఎన్నో ప్రయోజనాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఆధార్ కార్డు నమోదు సమయంలో వివరాలు తప్పుగా నమోదై ఉంటే ఇబ్బంది పడక తప్పదు.

ముఖ్యంగా ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ తప్పుగా ఉన్నా లేదా ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నంబర్ ను వినియోగించకపోయినా ఇబ్బంది పడక తప్పదని చెప్పవచ్చు. ఈ సమస్యలు ఉన్నవాళ్లు కొత్త మొబైల్ నంబర్ ను ఆధార్ కార్డ్ కు లింక్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లు ఇంటినుంచి సులభంగా మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
పోస్ట్ మ్యాన్ సహాయంతో ఇంటినుంచే సులభంగా మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్ట్ మ్యాన్ సహాయంతో ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్ డేట్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇంటినుంచి మొబైల్ నంబర్ అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కానివాళ్లు ఆధార్ అప్ డేట్ సెంటర్ కు వెళ్లడం ద్వారా మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవడం సాధ్యమవుతుంది.
ఆధార్ సెంటర్ లో మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేయించుకోవాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ తో పాటు అడ్రస్, బయోమెట్రిక్స్ వివరాలను అప్ డేట్ చేయించుకోవాలని భావిస్తే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.