India Tour Of West Indies: టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు మంగళవారమే వెళ్లింది. జులై 22 నుంచి వన్డే మ్యాచ్ షురూ కానుంది. వన్డే జట్టుకు శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నాడు. టీ 20 మ్యాచులు రోహిత్ శర్మ నేతృత్వంలో జరనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో వలే విజయాలు నమోదు చేయాలని టీమిండియా ఆశ పడుతోంది. కరేబియన్ జట్టును ఓడించి సిరీస్ లు కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. టీ20, వన్డే సిరీస్ లలో వెస్టిండీస్ ను ఓడించి విదేశీ గడ్డపై మరోమారు విజయఢంకా మోగించాలని తాపత్రయపడుతోంది.

టీమిండియా కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఖర్చు రూ.3.5 కోట్లు అయిందని తెలుస్తోంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. దేశమంతా వరద ముంపు బాధల్లో ఉంటే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారనే వాదనలు వచ్చాయి. దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. కొందరు మాత్రం వారు సాధించే విజయాల్లో ఈ డబ్బులు ఏపాటివని ప్రశ్నిస్తున్నారు. టికెట్లు దొరకకపోవడంతోనే ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాన్ని బీసీసీఐ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో క్రికెటర్ల కుటుంబ సభ్యులు కూడా వెళ్లినట్లు సమాచారం.
Also Read: Monkeypox: స్వలింగ సంపర్కం డేంజర్..! మంకీఫ్యాక్స్ విస్తరణకు అదే కారణమా..?

కరేబియన్ దీవుల్లో టీమిండియా కసరత్తులు చేస్తోంది. వెస్టిండీస్ ను ఎదుర్కోవడానికి ప్రాక్టీసు ముమ్మరం చేసింది. క్రీడాకారులు తమ శాయిశక్తుల కృషి చేసి ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. సమన్వయంతో సమష్టిగా రాణించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఇంగ్లండ్ పర్యటనలో లాగానే ఫలితాలు పునరావృతం చేయాలని సంకల్పిస్తోంది. దీనికి గాను అన్ని వ్యూహాలను ఖరారు చేస్తోంది. ఆటగాళ్ల కట్టడికి పకడ్బందీ ప్లాన్లు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Kesineni Family: తెరపైకి చిన్ని..ప్రస్టేషన్ లో కేశినాని నాని..విజయవాడ టీడీపీలో అసలేం జరుగుతోంది?